షాపింగ్ మాల్‌లో కారు బీభత్సం

  • Published By: madhu ,Published On : September 22, 2019 / 02:37 AM IST
షాపింగ్ మాల్‌లో కారు బీభత్సం

Updated On : September 22, 2019 / 2:37 AM IST

చికాగోలోని ఓ మాల్‌లో కారుతో యువకుడు భీత్సం సృష్టించాడు. మాల్‌లో ఉన్న సామాగ్రీని ధ్వంసం చేశాడు. దీంతో కొనుగోలు చేయడానికి వచ్చిన వారు, మాల్ సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనను అక్కడున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోలీసుల దృష్టికి రావడంతో ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

చికాగో సబర్బన్ ప్రాంతంలో ఉడ్ ఫీల్డ్ మాల్ ఉంది. సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం మాల్‌లోకి ఎంట్రెన్స్ ద్వారాన్ని పగులగొట్టుకుని బ్లాక్ కలర్ వాహనంతో 22 ఏళ్ల యువకుడు వచ్చాడు. మాల్‌లో అటూ ఇటూ తిప్పాడు. దీంతో ప్రాణాలు రక్షించుకోవడానికి అక్కడున్న వారు పరుగులు తీశారు. వస్తువులు ధ్వంసమయ్యాయి. అందులో ఉన్న వారు సెల్ ఫోన్‌లో చిత్రీకరించి పోస్టు చేశారు.

మాల్ బయట ఒక దానిని ఢీకొట్టుకుని కారు ఆగిపోయింది. అక్కడకు చేరుకున్న పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. అసలు ఎందుకలా నడిపాడో తెలియరాలేదు. ఇందులో ఉగ్రవాద అంశం లేదని పోలీసులు వెల్లడించారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నారు.