Google Images History : గూగూల్ ఇమేజస్ పుట్టడానికి కారణమైన ఫోటో ఏంటో మీకు తెలుసా?
మనకి ఏ ఇమేజ్ కావాలంటే గూగుల్ వెళ్లి వెతికేస్తాం. అసలు ఈ టూల్‌ని గూగుల్ అందుబాటులోకి తీసుకురావడానికి కారణమైన సెలబ్రిటీ ఎవరో తెలుసా?

Google Images History
Google Images History : సామాన్యులు, పొలిటికల్ లీడర్లు, సినిమా యాక్టర్లు, ప్రాంతాలు అసలు గూగుల్‌లో వెతికితే దొరకని ఫోటోలు ఉండవు. ఈజీగా సెర్చ్ చేసి చూసేస్తాం. 2001 వరకు గూగుల్ ఇమేజస్ ఆప్షన్ లేనే లేదు. గూగుల్ ఇమేజస్ అందుబాటులోకి రావడానికి కారణం ఓ ముద్దుగుమ్మ వేసుకున్న గ్రీన్ డ్రెస్. ఎవరా లేడీ? ఆ గ్రీన్ డ్రెస్ హిస్టరీ ఏంటి?
అమెరికన్ పాపులర్ నటి, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ గురించి తెలియని వారుండరు. ఈ రోజు మనం గూగుల్‌కి వెళ్లి ఫోటోలు వెతకడానికి కారణం ఈ సెలబ్రిటీనే. 2000 ఫిబ్రవరిలో గ్రామీ అవార్డుల వేడుక జరిగింది. ఆ కార్యక్రమంలో జెన్నిఫర్ లోపెజ్ గ్రీన్ గౌనులో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఈ అందమైన గౌనులో జెన్నిఫర్‌ను చూసిన నెటిజన్లు ఆమె ఫోటో కోసం ఓ రేంజ్‌లో వెతకడం మొదలుపెట్టారు. నెటిజన్ల వెతుకులాట చూసి గూగుల్ ఆశ్చర్యపోయింది. వెంటనే ఈ సమస్యకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యింది.
గూగుల్ సెర్చింజన్ 1998 లో మొదలైంది. గూగుల్ ఇమేజస్ మాత్రం 2001 జూలై నుండి అందుబాటులోకి వచ్చింది. అదీ జెన్నిఫర్ ఎఫెక్ట్‌తో అన్నమాట. ఇక ఈ గ్రీన్ గౌను పాపులారిటీ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. రీసెంట్‌గా ఇటలీలో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో జెన్నిఫర్ కొంచెం మార్పులు చేసిన ఇదే గ్రీన్ గౌనుతో ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేసారు. ఇక జెన్నీ క్యాట్ వాక్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. లక్షలాది మందిని ఆకట్టుకుంది.
Who wore Jennifer Lopez’s iconic green dress before she did? ⬇️ pic.twitter.com/DAKdVZBJTv
— HELLO! (@hellomag) February 9, 2023