Mitchell: సిక్స్ కొట్టిన మిచెల్.. పగిలిన బీర్ గ్లాస్.. మ్యాచ్ తరువాత ఏం జరిగిందంటే..
నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్ట్ ప్రారంభమైంది. టాస్ ఓడి కివీస్ బ్యాటింగ్‌కు దిగింది. తొలిరోజు కివీస్ భారీగా స్కోర్ సాధించింది. ఆట పూర్తయ్యే సమయానికి కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది.

Cricket
Mitchell: నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్ట్ ప్రారంభమైంది. టాస్ ఓడి కివీస్ బ్యాటింగ్‌కు దిగింది. తొలిరోజు కివీస్ భారీగా స్కోర్ సాధించింది. ఆట పూర్తయ్యే సమయానికి కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ డారిల్ మిచెల్ 147 బంతుల్లో 81 పరుగులు చేసి క్రిజ్‌లో ఉన్నాడు. సిక్స్ లు, ఫోర్లతో విరుచుకు పడ్డాడు. అయితే 56వ ఓవర్లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.
https://twitter.com/IanMcDougall1/status/1535282008410275841?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1535282008410275841%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fgranthshala.in%2Fthe-batsman-hit-a-six-the-ball-fell-into-the-womans-beer-glass-later-the-kiwi-team-had-to-do-something-like-this-video%2F
మిచెల్ కొట్టిన బంతి గాల్లోకి ఎగిరి మ్యాచ్ వీక్షిస్తున్న మహిళ బీర్ గ్లాసులో పడింది. బీర్ గ్లాస్ ఒక్కసారిగా పగిలిపోయి గ్లాసులోని బీరంతా ఆమె మొహం పడింది. దీంతో కంగారు పడ్డ ఆమె భయంతో అక్కడి నుంచి లేచింది. అక్కడ ఏం జరిగిందో కొద్దిసేపు ఎవరికి అర్థంకాలేదు. వీడియోను స్లో మోషన్ లో చూస్తేగానే తెలియలేదు.. మిచెల్ కొట్టిన బంతి మహిళల తాగుతున్న బీర్ గ్లాసులో పడిందని. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మిచెల్ కొంచెం బాల్ ను చూసికొట్టు అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Susan – the lady earlier who Daryl Mitchell’s pint hit – has been given a replacement by the Kiwi team 👏👏👏#ENGvNZ pic.twitter.com/53ig2R5cML
— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 10, 2022
ఇదిలాఉంటే మ్యాచ్ ముగిసిన తరువాత న్యూజిలాండ్ జట్టు ఆ మహిళలకు కొత్త బీర్ గ్లాస్ ను అందించింది. బీర్ గ్లాస్ తో పాటు ఓ లేఖను పంపించారు. మహిళ బీర్ గ్లాస్ పట్టుకొని, లేఖను చదువుతున్న ఫొటోలు కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో నెటిజన్లు కివీ జట్టు సభ్యులు చేసిన పనిని అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.