Solar Physicists : పెనుముప్పు తప్పదా? భగ్గుమంటున్న భానుడు .. సౌర శాస్త్రవేత్తల హెచ్చరిక..!

Solar Physicists : సూర్యుడు భగ్గుమని మండిపోతున్నాడు. రోజురోజుకీ సూర్యుడి తాపం అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. అందులోనూ వేసవి కావడంతో సూర్యుడి అగ్నిగోళంలా భగభగమని మండుతున్నాడు.

Solar Physicists : పెనుముప్పు తప్పదా? భగ్గుమంటున్న భానుడు .. సౌర శాస్త్రవేత్తల హెచ్చరిక..!

More Earth Ward Bound Solar Flares Likely In Coming Days, Warn Solar Physicists

Updated On : April 21, 2022 / 8:38 AM IST

Solar Physicists : సూర్యుడు భగ్గుమని మండిపోతున్నాడు. రోజురోజుకీ సూర్యుడి తాపం అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. అందులోనూ వేసవి కావడంతో సూర్యుడి అగ్నిగోళంలా భగభగమని నిప్పులు గక్కుతున్నాడు. బుధవారం ఉదయం 9.27 నిమిషాల సమయంలో సూర్యుడి నుంచి భారీ స్థాయిలో జ్వాలలు ఎగశాయి. సూర్యుని అతివేడితో దాని ప్రభావం సమీపంలోని శాటిలైట్లు, GPS వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని సోలార్ సైంటిస్టులు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. కోల్‌కతా కేంద్రంగా ‘సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ స్పేస్‌ సైన్సెస్‌ ఇండియా- (CESSI)’ ఒక ప్రకటనలో వెల్లడించింది. సౌర అయస్కాంత ప్రాంతమైన AR12992 నుంచి X‌-2.2 శ్రేణి సౌరజ్వాలలు సూర్యుని నుంచి భారీ స్థాయిలో వెదజల్లినట్టు తెలిపింది.

భారతదేశం, ఆగ్నేయాసియా, ఆసియా పసిఫిక్‌ ప్రాంతాల్లోనే ఈ సౌరజ్వాలల ప్రభావం అధికంగా ఉన్నాయని CESSI నిపుణులు గుర్తించారు. దీని ప్రభావంతో హై-ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు స్తంభించే అవకాశం ఉందని, అలాగే శాటిలైట్లు, జీపీఎస్‌ పనితీరులో లోపాలు తలెత్తే ఛాన్స్ ఉందంటున్నారు. ఎయిర్‌లైన్స్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థలపై కూడా తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉందని CESSI సమన్వయకర్త, ప్రొఫెసర్‌ దివ్యేందు నంది వెల్లడించారు. సౌరజ్వాలల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.

More Earth Ward Bound Solar Flares Likely In Coming Days, Warn Solar Physicists (1)

More Earth Ward Bound Solar Flares Likely In Coming Days, Warn Solar Physicists

సౌరవ్యవస్థ చుట్టూ తీవ్రమైన వేడిగాలులు వెలువడుతుంటాయి. అత్యంత శక్తివంతమైన సౌరజ్వాలలు సూర్యగోళం నుంచి సెగలు గక్కుతుంటాడు.. దీన్నే సోలార్‌ ఫ్లేర్‌ అని కూడా పిలుస్తారు. ఆ వేడిగాలుల ప్రభావంతో రేడియా, నేవిగేషన్‌ సంకేతాలతో పాటు విద్యుత్‌ గ్రిడ్‌లు కూడా తీవ్ర ప్రభావితమయ్యే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు.. విమానాలు, వ్యోమగాములకూ కూడా భారీ ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని సోలార్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇంతటీ తీవ్ర స్థాయిలో సౌరజ్వాలలు వస్తాయని దివ్యేందు బృందం ఏప్రిల్‌ 18నే అంచనా వేసింది.

భూకంపాల తీవ్రతను ఎలా గుర్తిస్తారో అలాగే ఈ సౌరజ్వాలల తీవ్రతనూ కూడా నాసా పర్యవేక్షిస్తుంటుంది. వీటిని A, B, C, M, X వంటి కేటగిరీలుగా డివైడ్ చేసింది. అయితే ఈ బుధవారం ఎగసిపడిన సౌర జ్వాలలు X కేటగిరీ సౌరజ్వాలలుగా గుర్తించింది. అత్యంత తీవ్రమైనవిగా పేర్కొంది. ఈ జ్వాలలు.. M కన్నా పది రెట్లు అధికంగా ఉన్నాయని, అలాగే C కేటగిరీ కన్నా వంద రెట్లు అత్యంత ప్రమాదకరమైనవిగా తెలిపింది.

Read Also : Solar Radiation: భూమిపై సౌర తుఫాను హెచ్చరికలు: మొబైల్, టీవీలపై తీవ్ర ప్రభావం