అమెరికాలో భారీగా ఉద్యోగుల తొలగింపు….తీవ్ర ఆందోళనలో భారతీయ H-1B వర్కర్లు

కరోనా వైరస్(COVID-19)ప్రభావం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై గట్టిగానే పుడుతుంది. దీనికి అమెరికా మినహాయింపు కాదు. అమెరికా వ్యాపారాలు కూడా కరోనా కారణంగా నష్టపోయాయి. అయితే కరోనా కారణంగా అమెరికాలోని వివిధ సెక్టార్ లలో భారీగా ఉద్యోగుల తొలగింపు(massive layoffs)ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో H-1B వీసాలు కలిగి ఉన్న ఫారిన్ టెక్నాలజీ ప్రొపెషనల్స్(విదేశీ వృత్తి నిపుణులు) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా కంపెనీలు ఏటా వేల సంఖ్యలో చైనా,భారత్ ల నుంచి టెక్నాలజీ నిపుణులను నియమించుకుంటుందన్న విషయం తెలిసిందే. అమెరికాలో H-1B వీసా కలిగి ఉన్నవారిలో సగంకిపైగా మంది ఈ రెండు దేశాలకు చెందినవారే. ఊహించని కరోనా కారణంగా అమెరికాలో రాబోయే రోజుల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు ఉంటుందన్న విశ్లేషణలతో తమ ఉద్యోగ భద్రతపై H-1B వీసాదారులు ఆందోళన చెందుతున్నారు.
అమెరికాలో పనిచేసేందుకు వృత్తి నిపుణులకిచ్చే 65 వేల హెచ్1-బీ వీసాల దరఖాస్తుల పరిమితి ముగిసిందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ సోమవారం తెలిపింది. ఎంపికైన వారి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని, దరఖాస్తులు సమర్పించడానికి జూన్ 30 చివరి తేదీ అని ప్రకటించింది.
ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా చాలా దేశాలు ఎంట్రీ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. అయితే అమెరికాలో H-1B వీసాలతో ఉన్నవాళ్లు తిరిగి తమ దేశాలకు చేరుకోలేరు. దీంతో మత 60రోజుల లిమిట్ ను తాత్కాలికంగా 180రోజులకు పొడిగించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు
ప్రస్తుత రూల్స్ ప్రకారం…H-1B వీసాదారులు ఉద్యోగం కోల్పోయినట్లే 60రోజుల వరకు అమెరికాలో ఉండేందుకు వీలు ఉంటుంది. అయితే ఈ 60రోజుల్లోనే వాళ్లు కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి లేకుంటే అమెరికా వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అయితే ఈ 60రోజుల లిమిట్ ను 180రోజులకు పెంచాలని H-1B వీసాదారులు ట్రంప్ సర్కార్ ను డిమాండ్ చేస్తున్నారు.
అమెరికాలో ప్రస్తుతం కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. అమెరికా వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. అమెరికాలో ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అమెరికా దీన్ని బయటపడేందుకు ఇంకా చాలారోజులు పట్టేట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే అమెరికాలో లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం. ఓ అంచనా ప్రకారం….దాదాపు 4.7కోట్ల మంది నిరుద్యోగులుగా మారనున్నారు.
హెచ్-1బీ వీసాపై అమెరికాలో ఉన్నవారు…నిరుద్యోగ ప్రయోజనాలకు అర్హులు కాదు. వారు సామాజిక భద్రతా(సోషల్ సెక్యూరిటీ) ప్రయోజనాలకు అర్హులు కాదు(ఈ ప్రయోజనం కోసం వారి జీతం నుండి తగ్గింపులు ఉన్నప్పటికీ కూడా). చాలా మంది హెచ్ -1 బి ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్నాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో… తొలగించిన జాబితాలో తాము అగ్రస్థానంలో ఉన్నామని కంపెనీలు ఇప్పటికే తమ H-1B ఉద్యోగులకు తెలియజేశాయి.
ఈ పరిణామాలతో తమ ఉద్యోగాలు పోయిన తర్వాత కూడా అమెరికాలో తాము ఉండేందుకు ఉన్న లిమిట్ ను పొడిగించాలని డిమాండ్ చేస్తూ H-1B వీసా కలిగినవాళ్లు వైట్ హౌస్ వెబ్‌సైట్‌లో ఓ పిటిషన్ క్యాంపెయిన్ ను ప్రారంభించారు. 60 రోజుల గ్రేస్ వ్యవధిని 180 రోజులకు తాత్కాలికంగా పొడిగించాలని మరియు ఈ క్లిష్ట సమయాల్లో H-1B వర్కర్లను రక్షించాలని మేము ట్రంప్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము అని పిటిషన్ లో ఇప్పటివరకు 20,000 మందికి పైగా సంతకాలు వచ్చాయి. అయితే వైట్ హౌస్ నుండి ప్రతిస్పందన పొందడానికి కనీసం 100,000 పిటిషన్లు అవసరం. భారీగా ఉద్యోగాల తొలగింపు అంచనాతో COVID-19 పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆర్థిక పరిస్థితులు హెచ్ 1 బి కార్మికులపై గణనీయమైన ప్రభావాన్ని చూపవచ్చని పిటిషన్ పేర్కొంది.