వాట్ యాన్ ఐడియా మామ్ : ఫాలో అయిపోతామంటున్న నెటిజన్స్

చిన్నతనం..పిల్లలు ఏవేవో అడుగుతుంటారు. అడిగినవన్నీ ఇవ్వాలనుకుంటారు. అమ్మానాన్నలు వద్దంటే అలుగుతారు.కోప్పడతారు.ఏడుస్తారు. కానీ వారు కోరినవన్నీ అనాలోచితంగా ఇచ్చేయటం ఎంతమాత్రం మంచిది కాదు. ప్రమాదాలు జరగొచ్చు. డబ్బు విలువ..వస్తువుల విలువ తెలియదు.పిల్లలు అడిగినవి వారికి
ఇచ్చేముందు వారికి అవి ఎంత వరకూ అవసరమో తెలుసుకుని ఇవ్వాలి. లేదంటే ఎటువంటి అనర్థాలు జరుగుతాయో వింటూనే ఉన్నాం. ఓ బాధ్యత కలిగిన తల్లి అలాగే ఆలోచించింది. కొత్తగా ఆలోచించింది. పిల్లలకు తెలియజెప్పింది. ఇది చూసిన తల్లిదండ్రులంతా ‘‘అమ్మ ఐడియా’’ సూపర్ అంటు మెచ్చుకుంటున్నారు. ఆ
అమ్మ కొత్త ఐడియా ఏంటో తెలుసుకోవాల్సిందే.
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని డబ్లిన్ ప్రాంతంలో షకేతా మరియన్ మెక్‌గ్రెగోర్ కు ముగ్గురు పిల్లలున్నారు.వారి పేర్లు సెరినిటీ, సిక్స్, టేకియా అంతా 13 సంవత్సరాల లోపువారే. వారు ఒకరోజు సెల్‌ఫోన్ కొనిపెట్టమని అడిగారు..మరోరోజు టూర్ కు వెళ్దామని అడిగారు. దీంతో షకేతా ఇంట్లో గోడపై కొన్ని పేపర్లు స్టిక్ చేసింది. ఇంటికి వచ్చిన పిల్లలు దాన్ని చూశారు. షాకయ్యారు. ఆ పేపర్లలో మెక్‌గ్రెగోర్ ఏం రాసిందంటే.. కిచెన్ మేనేజర్, లీడ్ హౌస్ కీపర్, లాండ్రీ సూపర్‌వైజర్ ఉద్యోగాలు చేయడానికి ఉద్యోగులు కావాలి. మామ్స్ క్రెడిట్ యూనియన్‌లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ రాసింది.
అంటే..పిల్లలు కోరికలు కోరటమేకాదు..బాధ్యతగా మెలగాలని తెలియజెప్పింది. పిల్లలకు ఇంట్లో పనులు నేర్పటమే కాకుండా..వారు కోరుకున్నవి కొనియ్యాలనే షకేతా మరియన్ ఐడియా కొత్తగా ఉంది కదూ. ఈ నోటీస్ పేపర్ల ఫొటోలను షకేతా మరియన్ తన ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసింది. అది చూసిన లక్షలాది మంది నెటిజన్లు
స్పందించారు. పిల్లలకు డబ్బు విలువ తెలిసేలా చేయడానికి ఇది కరెక్ట్ ఐడియా అంటూ ఎంతో మంది ప్రశంసించారు. మేము కూడా షకేతా మరియన్ ఐడియాను ఫాలో అవుతామంటున్నారు.