Musa Yamak : షాకింగ్.. గుండెపోటుతో రింగ్‌లోనే కన్నుమూసిన దిగ్గజ బాక్సర్.. ఇప్పటివరకు ఓటమన్నదే ఎరుగడు
అతడో దిగ్గజ బాక్సర్. ఇప్పటివరకు ఓటమన్నదే ఎరుగడు. అంతటి దిగ్గజ బాక్సర్ ను మృత్యువు ఓడించింది.(Musa Yamak)

Musa Yamak
Musa Yamak : అతడో దిగ్గజ బాక్సర్. ఇప్పటివరకు ఓటమన్నదే ఎరుగడు. అంతటి దిగ్గజ బాక్సర్ ను మృత్యువు ఓడించింది. గుండెపోటుతో రింగ్ లోనే కన్నుమూశాడు.

Musa Yamak (2)
జర్మనీ స్టార్ బాక్సర్ మూసా యమక్ విషాదకర పరిస్థితుల్లో మరణించాడు. గుండెపోటుతో బాక్సింగ్ రింగ్ లోనే కుప్పకూలాడు. మూసా యమక్ వయసు 38 ఏళ్లు. మ్యూనిచ్ లో గత శనివారం రాత్రి మూసా యమక్ ఉగాండాకు చెందిన హంజా వాండెరాతో తలపడ్డాడు. అయితే, మూడో రౌండ్ ప్రారంభానికి ముందు మూసా యమక్ మెల్లగా ముందుకు ఒరిగిపోయాడు. దాంతో ఈ పోటీని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారే కాదు, ప్రపంచవ్యాప్తంగా లైవ్ లో వీక్షిస్తున్నవారు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు.(Musa Yamak)

Musa
కాగా, ఈ పోరు రెండో రౌండ్ లో ప్రత్యర్థి హంజా విసిరిన పంచ్ యమక్ ను బలంగా తాకింది. దాంతో, అతడి అడుగులు తడబడ్డాయి. సరిగా నిల్చోలేకపోయాడు. అయితే, మూడో రౌండ్ కొన్ని సెకన్లలో ప్రారంభమవుతుందనగా, యమక్ గుండెపోటుకు గురయ్యాడు. డాక్టర్లు వెంటనే అతడికి ప్రథమ చికిత్స చేయగా, బౌట్ నిర్వాహకులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యమక్ మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు.

Musa Yamak (1)
BOXING SHOCK Musa Yamak dead aged 38: German boxer collapses in ring and suffers heart attack in ninth pro fight
Rest in peace.#MusaAskanYamak pic.twitter.com/KxH8euOsKT
— Thomas J. Gold (@TheFacilitatorr) May 16, 2022
మూసా యమక్ ఇప్పటివరకు ఆడిన 8 ప్రొఫెషనల్ బౌట్లలో గెలుపొందాడు. అన్ని విజయాలు కూడా ప్రత్యర్థిని నాకౌట్ చేయడం ద్వారానే సాధించాడు. టర్కీ జాతీయుడైన మూసా యమాక్ 2017లో ప్రొఫెషనల్ బాక్సర్ అవతారం ఎత్తాడు. 2021లో వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచాక అతడి పాపులారిటీ పెరిగిపోయింది. యమక్.. యూరోపియన్, ఆసియన్ ఛాంపియన్ షిప్ గెలిచాడు. స్టార్ బాక్సర్ ఆకస్మిక మృతితో బాక్సింగ్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మూసా యమక్ ఆకస్మిక మరణం తోటి బాక్సర్లను షాక్ కు గురి చేసింది. మూసా యమాక్ ఇక లేడు అనే వార్తను తోటి బాక్సర్లు, అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు.
Andrew Symonds: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి

Musa Yamak (3)
Devastating Moment Champion Boxer Collapses and Dies from Heart Attack (Warning: Distressing Video)
Undefeated Turkish-German boxer Musa Yamak collapsed as he tried to come out for the 3rd round of his 9th professional bout near Munich, Germany. pic.twitter.com/RSzeDO6s9J
— ?Nikos ?????? (@CyprusNik) May 17, 2022