Nasa Ingenuity Copter: తర్వాతి ఫ్లైట్ కోసం నాసా కాప్టర్ కొత్త ప్రయోగం

మార్స్ తలంపై ఆపరేటింగ్ చేస్తున్న నాసా ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ తర్వాతి ఫ్లైట్ కొత్త రికార్డులు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు చిన్న సోలార్ ఛార్జ్‌డ్ రోటర్‌క్రాఫ్ట్ చేస్తున్న పని కొత్త లెవల్ కు తీసుకెళ్తుందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం వెల్లడించింది.

Nasa Ingenuity Copter: తర్వాతి ఫ్లైట్ కోసం నాసా కాప్టర్ కొత్త ప్రయోగం

Nasa (1)

Updated On : July 3, 2021 / 7:03 PM IST

Nasa Ingenuity Copter: మార్స్ తలంపై ఆపరేటింగ్ చేస్తున్న నాసా ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ తర్వాతి ఫ్లైట్ కొత్త రికార్డులు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు చిన్న సోలార్ ఛార్జ్‌డ్ రోటర్‌క్రాఫ్ట్ చేస్తున్న పని కొత్త లెవల్ కు తీసుకెళ్తుందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం వెల్లడించింది. తన తర్వాతి ప్రయాణమైన ఫ్లైట్ 9తో పర్సవరెన్స్ రోవర్ నుంచి అత్యంత వేగంతో ప్రయాణించొచ్చని పేర్కొంది.

మార్షియన్ తలంపై ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ సాధ్యమైనంత క్లోజ్ గా వెళ్లింది. ప్రస్తుత లొకేషన్.. ఇసుకతో కూడి ఉండటంతో రోవర్ కదిలేందుకు చక్రాలు కాస్త ఇబ్బందిని కలుగజేస్తున్నాయి. ఇన్‌జెన్యూటీకి చెందిన చివరి రెండు ఫ్లైట్లు రోవర్ తో జర్నీ కొనసాగించేందుకే ప్లాన్ చేశారని నాసా అధికారికంగా స్టేటస్ ను ప్రకటించింది.

తర్వాతి ఫ్లైట్ (ఫ్లైట్ 9).. మార్స్ మీద మాత్రమే తిరిగేదిగా, ఏదైనా కొత్తగా క్రియేట్ చేసేదిగా ఉండబోతుందని నాసా చెప్పింది. అక్కడి తలంపై ల్యాండ్ అవనున్న చిన్న రోబోటిక్ హెలికాప్టర్ సితా రీజియన్ పై ల్యాండ్ అవడానికి షార్ట్‌కట్ అరేంజ్ చేసుకోనుంది.

ఇదిలా ఉంటే తన రికార్డులు తానే బ్రేక్ చేయనుంది ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్. గ్రౌండ్ స్పీడ్, డిస్టెన్స్, టైమ్ అలాఫ్ట్ అంశాల్లో దూసుకెళ్తుంది.

1. 2వేల 51 అడుగుల వరకూ (625 మీటర్లు).
2. సెకనుకు 5 మీటర్లు (16 అడుగులు).
3. దాదాపు ఎయిర్‌బోర్న్‌లో 167 సెకన్లు.
4. దారి గుండా కనిపించిన వస్తువులను కలర్ ఫొటోగా పిక్చరైజ్ చేస్తుంది.

ఫండమెంటల్ గా.. కొత్త పద్ధతిలో ఇన్‌జెన్యూటీ నేవిగేషన్ అల్గారిథమ్ ను పెంపొందించేలా కృషి చేస్తుందని నాసా చెప్పింది.