Israel Palestine Conflict: అవసరమైతే.. గాజాలో పౌరుల మరణంపై వస్తున్న విమర్శలపై నెతన్యాహూ ఎదురుదాడి

ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 11,078కి చేరుకుంది. వీరిలో 4,506 మంది పిల్లలు ఉండగా.. 3,027 మంది మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నందున ప్రపంచ దేశాలన్నీ గాజాలో కాల్పుల విరమణను డిమాండ్ చేస్తున్నాయి.

Israel Palestine Conflict: అవసరమైతే.. గాజాలో పౌరుల మరణంపై వస్తున్న విమర్శలపై నెతన్యాహూ ఎదురుదాడి

Updated On : November 12, 2023 / 8:12 PM IST

Israel Palestine Conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్ లోని వేలాది మంది మరణించారు. అయితే దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రపంచ నలుమూలల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ విమర్శలపై ఆయన ఎదురుదాడికి దిగారు. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం.. హమాస్‌ను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డుతామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పునరుద్ఘాటించారు. అవసరమైతే తాము ప్రపంచానికి అండగా నిలుస్తామన్నారు.

ఆదివారం రక్షణ మంత్రి యోవ్ గాలంట్, మంత్రి బెన్నీ గాంట్జ్‌లతో కలిసి నిర్వహించిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాశ్చాత్య నాయకులను యూదు రాజ్యానికి మద్దతు ఇవ్వాలని కోరారు. హమాస్‌పై విజయం అంటే స్వేచ్ఛ కోరుకునే ప్రపంచానికి కూడా విజయమని ఉమ్మడి ప్రకటన చేశారు. యుద్ధం అనంతరం గాజాకు పాలస్తీనా అథారిటీ తిరిగి రావడాన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తుందని నెతన్యాహు అన్నారు. గాజా స్ట్రిప్‌లో క్షీణిస్తున్న మానవతా పరిస్థితి, పౌర మరణాలపై ప్రపంచంలోని అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే నెతన్యాహూ పై విధంగా స్పందించారు.

గాజాలోని పౌరులను రక్షించేందుకు కృషి చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గత శుక్రవారం కోరారు. వారికి (గాజాలోని పాలస్తీనియన్లు) మానవతా సహాయం అందేలా చూడాలని ఆయన అన్నారు. యుద్ధ సమయంలో చాలా మంది పాలస్తీనియన్లు మరణించారని ఆయన అన్నారు. అయినప్పటికీ, హమాస్‌ను నాశనం చేయాలని డిమాండ్ చేయడంలో తనతో కలిసి రావాలని నెతన్యాహు అమెరికన్లకు పిలుపునిచ్చారు. అమెరికాకు కూడా హమాస్ ముప్పుగా పరిణమించవచ్చని ఆయన అన్నారు.

హమాస్ నుంచి తమకు ప్రమాదం ఉందని చాలా మంది అమెరికన్లు గ్రహించారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. కొన్ని దేశాల్లో కాల్పుల విరమణ కోసం నాయకులపై ఒత్తిడి తెస్తున్నారని, పాలస్తీనా మద్దతుదారులు చేస్తున్న నిరసనల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో పాలస్తీనా మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. గత శనివారం లండన్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనిపై నెతన్యాహు మాట్లాడుతూ ఒత్తిడికి లొంగవద్దని అన్నారు.

ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 11,078కి చేరుకుంది. వీరిలో 4,506 మంది పిల్లలు ఉండగా.. 3,027 మంది మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నందున ప్రపంచ దేశాలన్నీ గాజాలో కాల్పుల విరమణను డిమాండ్ చేస్తున్నాయి.