Netherlands : భారత విమానాలపై బ్యాన్ ఎత్తేసిన నెదర్లాండ్స్

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై ఏప్రిల్-26,2021న విధించిన నిషేధాన్ని మంగళవారం(జూన్-1,2021) నుంచి ఎత్తివేస్తున్నట్లు నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రకటించింది.

Netherlands : భారత విమానాలపై బ్యాన్ ఎత్తేసిన నెదర్లాండ్స్

Netherlands Lifts Ban On Passenger Flights From India Starting June 1

Updated On : June 1, 2021 / 8:04 PM IST

Netherlands దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై ఏప్రిల్-26,2021న విధించిన నిషేధాన్ని మంగళవారం(జూన్-1,2021) నుంచి ఎత్తివేస్తున్నట్లు నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రకటించింది. జూన్-1 నుంచి భారత్ నుంచి నెదర్లాండ్స్ కి ప్రయాణికుల విమానాలు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది.

అయితే నెదర్లాండ్స్ కి వచ్చే ప్రయాణికులు కరోనా టెస్ట్ నెగిటివివ్ రిపోర్ట్ సమర్పించడం,ట్రావెల్ క్వారంటైన్ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. మరోవైపు, ఇప్పటికీ కొన్ని దేశాలు భారత ప్రయాణికుల విమనాలపై నిషేధాన్ని కొనసాగిస్తున్నాయి. భారత్ నుంచి విమానాల రాకపోకలపై యూఏఈ నిషేధాన్ని జూన్ 30వతేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

ఇక, ఫిలిప్పీన్స్ కూడా భారత విమాన ప్రయాణికుల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని జూన్ 15 వరకు పొడిగించింది. కొవిడ్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా భారత్ తో సహా ఏడు దేశాల( పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ప్రయాణికులు రాకుండా నిషేధాన్ని ఫిలిప్పీన్స్ ప్రధానమంత్రి రోడ్రిగో దుతేర్తీ సోమవారం ప్రకటించారు.