భూమిపై నీరు ఆవిర్భవించడానికి మూలం ఇదే..

భూమిపై నీరు ఆవిర్భవించడానికి మూలం ఇదే..

Updated On : July 18, 2020 / 5:47 PM IST

భూమిపై మానవ మనుగడ కంటే ముందు జీవి పుట్టడాని కంటే ముందే నీరు ఆవిర్భవించింది. నీటి పుట్టుక గురించి తెలుసుకోవాలని ఆరా తీసిన సైంటిస్టులకు కొన్ని ఆధారాలు దొరికాయి. ఓ సేంద్రియ పదార్థం నుంచి నీరు పుట్టుకొచ్చిందని.. దానిని వేడి చేయడం ద్వారానే ఇది సాధ్యమైందని తెలిసింది. నీటి పుట్టుకతో పాటు భూమిపై కనిపించే వందల విషయాలు మిస్టరీగానే నిలిచిపోయాయి.

కొన్ని యాక్టివ్ స్టడీల ప్రకారం.. నీరు అనేది మంచుగడ్డల నుంచి కరిగి పుట్టుకొచ్చింది. తక్కువ ఉష్ణోగ్రతల్లో మంచు టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ నీరుగా మారింది. ‘ఇప్పటి వరకూ సేంద్రీయ పదార్థంపై ఓ మాదిరి అటెన్షన్ పెట్టాం. ఐస్ లు, సిలికేట్ల కంటే అందులోనే సమృద్ధిగా ఉందని తెలిసింది’ అని హోక్కాయిడో యూనివర్సిటీ ప్లానెటరీ సైంటిస్ట్ అకీరా కోచి అన్నారు.

అకోరా కోచి నేతృత్వంలో జరిగిన పరిశోధనలో ఇంటర్ స్టెల్లార్ సేంద్రీయ పదార్థం నుంచి నీరు, ఆయిల్ బయటికొచ్చాయని చెప్పారు. మంచు పొర కింద నీరు ప్రొడ్యూస్ అయి ఉండొచ్చు. మంచు పొరల ప్రమేయం లేకుండానే నీరు అనేది ఉత్పత్తి అయింది.

ఫస్ట్ స్టెప్‌గా రీసెర్చర్స్ కెమికల్ రీఏజెంట్స్ ఉపయోగించి ఇంటర్‌స్టెల్లార్ లో సేంద్రియ పదార్థం గురించి రీసెర్చ్ చేశారు. ఈ విశ్లేషణలో UVని ఇర్రేడియేట్ చేయడంతో అందులో H2O, CO, NH3లు ఉన్నట్లు తెలిసింది. నేచురల్ సింథటిక్ ప్రోసెస్ లో భాగంగానే ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఆర్గానిక్ పదార్థాన్ని 24 నుంచి 400 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ ప్రెజర్డ్ కండిషన్ లో వేడి చేశారు.

100డిగ్రీల వరకూ ఏ మార్పులు లేకుండా ఉన్న శాంపుల్ లో 200డిగ్రీల వద్ద రెండుగా విడిపోయింది. 350డిగ్రీల వద్ద నీటి చుక్కలు ఏర్పాడ్డాయి. టెంపరేచర్ 400డిగ్రీలకు పెరిగే కొద్దీ నీరు పెరిగింది. దాంతో పాటు బ్లాక్ ఆయిల్ కూడా ఉత్పత్తి అయింది. తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఆర్గానిక్ పదార్థంతో పరిశోధనలు మళ్లీ జరిపారు. నీరు, ఆయిల్ ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యాయి.

ఈ అనాలసిస్ తో స్వచ్ఛమైన నీరు ఉత్పత్తి అయినట్లుగా తెలిసింది. కెమికల్ అనాలసిస్ తో ఉత్పత్తి అయిన ఆయిల్.. భూమిలో దొరికే క్రూడ్ ఆయిల్ కు ఒకటే లక్షణాలు ఉన్నాయి. ఈ ఫలితాలను బట్టి ఆర్గానిక్ మేటర్ లోపల ఉండే మంచుపొరే భూమిపై నీరు ఏర్పడటానికి కారణం అని అర్థమైంది. భూమిలో పెట్రోలియం వంటి వనరులకు అదే కారణమని, నీరు విడిపోయాక వచ్చిన ఆయిల్ సహజ వనరుల్లో ఒకటని వెల్లడించారు.