ట్రంప్‌కు తిక్క: ఉత్తర కొరియా

ట్రంప్‌కు తిక్క: ఉత్తర కొరియా

Updated On : December 10, 2019 / 3:59 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌‌పై ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి మాటల దాడి చేసింది. ఆదివారం నిర్వహించిన కీలక ఆయుధ పరీక్షపై ట్రంప్‌ పరోక్ష హెచ్చరికలు చేయడంతో ఆ దేశం ధీటుగా బదులిచ్చింది. ‘ట్రంప్‌‌కు తిక్క ఆలోచనలు లేని, వృద్ధుడు’ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ విషయాన్ని ఉత్తర కొరియా సీనియర్‌ అధికారి కిమ్‌ యోంగ్‌ చోల్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. 

యూఎస్‌ ఒత్తిళ్లకు ఉత్తరకొరియా తలొగ్గదని చెప్పారు. అణ్వస్త్ర చర్చలకు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో ట్రంప్‌ ప్రభుత్వం ఒత్తిడికి గురిచేసేందుకు ప్రయత్నిస్తోంది. అణ్వస్త్ర ప్రయోగాలను ఆపేందుకు బదులుగా తమపై ఉన్న విస్తృత ఆంక్షల్ని తొలగించాలని డిమాండు చేయడంతో అమెరికా వాటిని తిరస్కరించింది.

 
వీటిపై కిమ్‌ స్పందిస్తూ.. అమెరికా తమపై ఆంక్షలు, ఒత్తిళ్లు కొనసాగిస్తే మరో కొత్త మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ఈ ఒప్పందానికి పరస్పర అంగీకారం కోసం ఏడాది చివరి వరకు గడువును విధించారు. ఆదివారం కీలక ప్రయోగం చేశామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ ప్రకటించారు. దీనిపై అమెరికా అసహనం వ్యక్తం చేసింది. 

 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. ‘అమెరికాతో ప్రత్యేక బంధాన్ని కిమ్‌ రద్దు చేసుకోరనే అనుకుంటున్నా’ అని పరోక్షంగా హెచ్చరించారు.