జాదవ్ కేసులో పాక్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించింది..UNకి తెలిపిన వరల్డ్ కోర్టు

  • Published By: venkaiahnaidu ,Published On : October 31, 2019 / 11:01 AM IST
జాదవ్ కేసులో పాక్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించింది..UNకి తెలిపిన వరల్డ్ కోర్టు

Updated On : October 31, 2019 / 11:01 AM IST

కుల్‌భూష‌ణ్ జాద‌వ్ కేసులో పాకిస్తాన్ వియ‌న్నా ఒప్పందాన్ని  అతిక్ర‌మించింద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి తెలిపింది. ఇంట‌ర్నేష‌నల్ కోర్ట్ ఆఫ్ జ‌స్టిస్(ICJ) ప్రెసిడెంట్ జ‌డ్జి అబ్దుల్‌కావి యూసుఫ్ బుధవారం UNGC(యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ)లో చెప్పారు. 193 సభ్యుల యూఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో జ‌డ్జి అబ్దుల్‌కావి .. జాద‌వ్ కేసులో రిపోర్ట్‌ను ప్ర‌జెంట్ చేశారు. జూలై 17వ తేదీన జ‌రిగిన విచార‌ణ‌కు సంబంధించిన తీర్పు ఆ రిపోర్ట్‌లో ఉంది. త‌న తీర్పులో  వియ‌న్నా క‌న్వెన్ష‌న్‌లోని ఆర్టిక‌ల్ 36 నిబంధ‌న‌ల‌ను పాక్ అతిక్ర‌మించింద‌న్నారు. 

గూఢచర్యం ఆరోపణలతో 2017 ఏప్రిల్ లో పాకిస్తాన్ మిలిట‌రీ కోర్టు కుల్‌భూష‌ణ్ జాద‌వ్ కు మ‌ర‌ణ‌శిక్ష విధించింది. అయితే జాదవ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని,బిజినెస్ పనిమీద ఇరాన్ వెళ్లిన జాదవ్ ను పాక్ కిడ్నాప్ చేసిందని భారత్ ఈ కేసులో అంతర్జాతీయ కోర్టుని ఆశ్రయించింది. జాదవ్ కు న్యాయసహాకారకు పాక్ తిరస్కరించిందని,1963 వియన్నా ఒప్పందంలొని కాన్సులర్ సంబంధాలకు ఇది వ్యతిరేకమని భారత్ వాదనలు వినిపించింది.

జాదవ్ కేసులో పాకిస్తాన్ త‌న తీర్పును స‌మీక్షించుకోవాల‌ని పునఃసమీక్షించాలంటూ ఈ ఏడాది జులై 17న  అంత‌ర్జాతీయ కోర్టు కోరింది. కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌కు విధించిన శిక్ష విష‌యంలో సంపూర్ణ స్థాయిలో స‌మీక్ష జ‌ర‌గాల‌ని అబ్దుల్‌కావి యూసుఫ్ యూసుఫ్ నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయ‌ప‌డింది.