పాకిస్తాన్ లో ధరల సంక్షోభం : పేదల ఆకలి కేకలు

  • Published By: veegamteam ,Published On : April 4, 2019 / 01:22 PM IST
పాకిస్తాన్ లో ధరల సంక్షోభం : పేదల ఆకలి కేకలు

Updated On : April 4, 2019 / 1:22 PM IST

పాకిస్తాన్ లో నిత్యావసర ధరల సంక్షోభం తలెత్తింది. ఐదేళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం చేరుకుంది. సామాన్యులు ఒక పూట తిండి తినటానికే గగనం అయిపోయింది. అమాంతం పెరిగిన ధరలతో పాక్ ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
– బియ్యం ధర కనిష్టం కిలో రూ.60లకు చేరుకుంది. ఇది కూడా హాల్ సేల్ మార్కెట్ లో. రిటైల్ లో కిలో బియ్యం కనీసం రూ.70గా ఉంది.
– లీటర్ పెట్రోల్ రూ.100 చేరుకుంది. మూడు రోజుల్లోనే 6 రూపాయలు పెరిగింది. దీంతో ట్యాక్సీలు, ఆటోలు, రవాణానే జీవనాధారంగా బతికే వారికి కష్టకాలం వచ్చింది. చేతికి రూపాయి రాకపోగా.. పెట్రోల్, డీజిల్ కోసం ఎదురు ఖర్చు చేయాల్సి వస్తోంది.
– హోటల్ లో ఫుడ్ ఛార్జీలు కూడా అమాంతం పెంచేశారు. నెల రోజుల్లోనే డబుల్ అయ్యాయని చెబుతున్నారు పాక్ ప్రజలు.
– రోజువారీ కూలీ పనితో జీవతాన్ని నెట్టుకొచ్చేవారు.. మండుతున్న ధరలతో ఒకపూట తిండితోనే సరిపెట్టుకుంటున్నారు.
– పేదలు లేకుండా చేస్తాం అన్న ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు నిజంగా పేదలు లేకుండా చేస్తున్నారంటూ వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు.
– ధరలు అదుపు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు అదే ధరల మంటతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
– ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి అయిన తర్వాతే ధరలు మరింత పెరిగాయి అంటున్నారు ప్రజలు
– నిత్యావసర ధరల సంక్షోభం నుంచి గట్టెక్కించాలని చైనాను వేడుకుంటోంది పాకిస్తాన్
– ఇప్పటికే సౌదీ, అరబ్ దేశాలు 11 బిలియన్ డాలర్ల సాయాన్ని ఇంధనం రూపంలో అందించాయి.
– పాక్ నిత్యావసర ధరల సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే స్వదేశీ ఉత్పత్తులు, పరిశ్రమలను ప్రోత్సహించాలని ఆర్థికవేత్తలు కోరుతున్నారు. దిగుమతి వస్తువులపై ఆంక్షలు విధించటం ద్వారా అదుపు చేయవచ్చని సూచిస్తున్నారు.
– పాక్ రూపీ విలువ డాలర్ తో పోల్చితే 0.49గా ఉంది.