Cricketer Suicide Attempt : జట్టులోకి ఎంపిక చేయలేదని.. క్రికెటర్ ఆత్మహత్యాయత్నం

జట్టులోకి ఎంపిక చేయలేదని తీవ్రంగా నిరాశపడ్డ ఓ క్రికెటర్.. ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం కలకలం రేపింది. చనిపోవాలన్న ఉద్దేశంతో మణికట్టు కోసుకున్నాడు.

Cricketer Suicide Attempt : జట్టులోకి ఎంపిక చేయలేదని.. క్రికెటర్ ఆత్మహత్యాయత్నం

Cricketer Suicide Attempt

Updated On : June 22, 2022 / 8:39 PM IST

Cricketer Suicide Attempt : జట్టులోకి ఎంపిక చేయలేదని తీవ్రంగా నిరాశపడ్డ ఓ క్రికెటర్.. ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఈ ఘటన పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. పాకిస్తాన్ లోని సదరన్ సింధ్ ప్రావిన్స్ కు చెందిన షోయబ్ దేశవాళీ క్రికెటర్. అతడు ఓ ఫాస్ట్ బౌలర్. అయితే, దేశవాళీ జట్టులో అతడికి స్థానం లభించలేదు. కోచ్ తీరు పట్ల తీవ్ర మనస్తాపం చెందిన అతడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇంటర్ సిటీ చాంపియన్ షిప్ కోసం కోచ్ తనను ఎంపిక చేయకపోవడంతో షోయబ్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.

Umpire Caught: మ్యాచ్ మధ్యలో బాల్ క్యాచ్ అందుకున్న అంపైర్!

కోచ్ తీరు పట్ల తీవ్ర ఆవేదనకు గురయ్యాడు షోయబ్. మానసిక వ్యధతో తన గదికే పరిమితమయ్యాడు. చనిపోవాలన్న ఉద్దేశంతో మణికట్టు కోసుకున్నాడు. బాత్ రూమ్ లో అపస్మారక స్థితిలో పడున్న అతడిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Rishabh Pant: సచిన్‌లా పంత్‌ను కూడా ఓపెనర్ చేస్తే..

కాగా, 2018లోనూ ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. కరాచీ అండర్-19 జట్టు నుంచి తనను తొలగించడంతో ముహమ్మద్ జర్యాబ్ అనే యువ క్రికెటర్ ఉరేసుకుని చనిపోయాడు. ఒక్కోసారి ఎంత మంచి ప్రదర్శన చేసినప్పటికీ, జట్టులో చోటు లభించకపోవడం ప్రతి క్రికెటర్ కు ఏదో ఒక దశలో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అయితే కొందరు.. ఆ బాధను ఓవర్ కమ్ చేస్తారు. టైమ్ కోసం వెయిట్ చేస్తారు. తమదైన రోజున సత్తా చూపి జట్టులోకి ఎంపిక అవుతారు. అయితే కొందరు ప్లేయర్లు కుంగిపోయి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.