Peacock fight with women : ఇద్దరు మహిళలు నెమలి గుడ్లు దొంగిలించాలనుకున్నారు.. ఆ నెమలి ఎలా బుద్ధి చెప్పిందంటే?
తమ జోలికి వస్తే ఊరుకోమని నిరూపించింది ఓ నెమలి. తన గుడ్లను కాపాడుకోవడానికి యుద్ధం చేసింది. ఇంతకీ నెమలి ఎవరితో యుద్ధానికి దిగింది.

Peacock fight with women
పక్షులే కదా అనుకోవద్దు.. కోపం వస్తే అవి కూడా మనుష్యుల్లాగనే ప్రవర్తిస్తాయి.. తేడా వస్తే తాట తీస్తాయి. ఓ నెమలి తన గూడు నుంచి గుడ్లు దొంగిలించబోయిన మహిళలకి ఎలా బుద్ధి చెప్పిందంటే..
Clocks Gift from God : వింత ఆచారం..సిగరెట్ వెలిగిస్తే ఈ దేవుడు కోరికలు తీరుస్తాడట..!!
ఓ నెమలి (peacock) చెట్టుపై ఉన్న తన గూడులో గుడ్లు పెట్టింది. ఆ గుడ్లపై కన్నేసిన ఇద్దరు మహిళలు తస్కరించాలని ప్రయత్నించారు. ఓ మహిళ చెట్టెక్కి కింద నిలబడి ఉన్న మహిళకు గుడ్లు అందించడం మొదలుపెట్టింది. ఎలా పసిగట్టిందో ఎగురుకుంటూ వచ్చిన నెమలి ఒక్కసారిగా చెట్టుపై ఉన్న మహిళపై దాడి చేసింది. గుడ్లు తీయనీయకుండా అడ్డుపడింది. కిందనే ఉండి ఇదంతా చూస్తున్న మహిళను కూడా నెమలి విడిచిపెట్టలేదు. ఒక్క ఉదుటన ఆమెపైకి కూడా దూకి కింద పడేసింది. ఇక ఆ మహిళల పరిస్థితి ఊహించండి. భయంతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ది ఫిగెన్ @TheFigen అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ అయిన ఈ వీడియోకి లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. నెమలి తన గుడ్లను కాపాడుకున్న తీరుని చూసి అభినందిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చూసైనా పక్షులు, జంతువుల జోలికి పోవద్దని సలహా ఇస్తున్నారు.
They deserved more! 💪
— The Figen (@TheFigen_) April 17, 2023