ఇదేం అలవాటురా బాబూ : కిలోన్నర వెంట్రుకలు మింగేసింది

  • Published By: veegamteam ,Published On : March 5, 2019 / 11:28 AM IST
ఇదేం అలవాటురా బాబూ : కిలోన్నర వెంట్రుకలు మింగేసింది

Updated On : March 5, 2019 / 11:28 AM IST

గువాంగ్ డాంగ్‌ : కొంతమంది చిన్నారులకు  మట్టి తినటం అలవాటు..మరికొందరు సుద్ద ముక్కలు.. కచ్చికలు.. తినటం అలవాటుగా ఉంటుంది. కానీ చైనాలోని గువాంగ్ డాంగ్ కు చెందిన  ఓ 8 ఏళ్ల బాలిక మాత్రం వెంట్రుకల్ని తినటం అలవాటుగా చేసుకుంది.

ఈ క్రమంలో తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఎనిమిదేళ్ల చిన్నారిని పరీక్షించిన వైద్యులు బాలిక కడుపులో 1.5 కేజీల బరువున్న వెంటుకలను చూసి షాకయ్యారు. ఫెయ్ఫెయ్ అనే బాలికకు రెండేళ్ల వయస్సు నుంచి తల వెంటుకలను తినడం అలవాటుగా మారింది.
Also Read : ఎయిడ్స్ తగ్గింది: ప్రపంచంలో రెండవ వ్యక్తి అతనే!

కడుపులోకి చేరిన ఆ వెంట్రుకలు కాస్తా ఒకచోట చేరి  ఉండలా పేరుకుపోయాయి. దీంతో కడుపులో నొప్పి రావడం..వాంతులు కావటంతో దొంగువా ఆసుపత్రిలో చేర్చారు. ఫెయ్ఫెయ్‌కు సీటీ స్కాన్ చేసిన డాక్టర్స్ కు ఆమె కడుపులో ఉండలా చుట్టుకున్న వెంట్రుకల్ని గమనించిన వారు ఎండోస్కోపీ ద్వారా ఆ 1.5 కేజీల వెంట్రులకను తీసేశారు. 

వెంటుకలను తినే అలవాటు చాలా ప్రమాదకరమైనదనీ..దీన్ని వైద్య పరిభాషలో దీన్ని ‘పికా’ అంటారని తెలిపారు. వెంట్రుకలు ఈ అలవాటున్నవారు పోషకాల్లేని వస్తువులను తినాలని వారికి అనిపిస్తుందనీ అందుకే ఫెయ్ఫెయ్ కూడా అందుకే వెంట్రుకలను తినటం చేసిందని తెలిపారు. దీంతో వెంటుకలు తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు డాక్టర్లు సూచించారు. 
Also Read : పెళ్లి కూతురు హ్యాండిచ్చింది: పెళ్లి కొడుకు సూసైడ్