ఒక తుమ్ముతో విమానం ఆగిపోయింది
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా భయం ఏ రేంజ్

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా భయం ఏ రేంజ్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా భయం ఏ రేంజ్ లో ఉందంటే.. ఎవరైనా తుమ్మినా, దగ్గినా.. భయంతో వణికిపోయే పరిస్థితి ఉంది. తాజాగా ఓ ప్రయాణికుడి తుమ్ము ఏకంగా విమానాన్నే ఆపేసింది.
వివరాల్లోకి వెళితే.. ఓ ప్రయాణికుడికి తుమ్ములు రావడంతో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ అయింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న వేళ, ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. కొలరాడో రాష్ట్రంలోని ఈగిల్ ఎయిర్ పోర్టు నుంచి న్యూజెర్సీకి ఓ విమానం బయలుదేరింది. కాసేపటికే అందులో ఉన్న ఓ ప్రయాణికుడికి తుమ్ములు వచ్చాయి. దాంతో పాటే దగ్గూ వచ్చింది. అంతే తోటి ప్రయాణికులు ప్రయాణికులు భయాందోళన చెందారు.
వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అలర్ట్ అయిన సిబ్బంది సమీపంలో ఉన్న డెన్వర్ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారాన్ని అందించారు. ఫ్లయిట్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు అనుమతి కోరడంతో వారు అంగీకరించారు. పైలట్ డెన్వర్ ఎయిర్ పోర్టులో విమానాన్ని దించగా, అప్పటికే సమాచారాన్ని అందుకుని అక్కడికి చేరుకున్న వైద్యులు.. ఆ వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించారు. అలర్జీ వల్లే తుమ్ములు, దగ్గు వచ్చాయని తేల్చారు. కరోనా లేదని నిర్ధారించారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత విమానం బయలుదేరి వెళ్లింది.
జలుబు, దగ్గు, జ్వరం, కళ్ల మంటలు.. కరోనా వైరస్ లక్షణాలు. ఇవి అటాక్ అయ్యాయంటే అప్రమత్తం అవ్వాల్సిందే. వెంటనే వెళ్లి డాక్టర్ కి చూపించుకోవాలి. కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందే. జలుబు, దగ్గు, జ్వరంతోనే కరోనా అటాక్ అవుతుందన్న విషయం తెలిసిందే. అందుకే.. ఎవరైనా తుమ్ముతూ, దగ్గుతూ కనిపిస్తే.. చుట్టుపక్కల ఉన్నోళ్లు భయపడిపోతున్నారు.
2019 డిసెంబర్ లో చైనాలోని వూహాన్ లో కరోనా వెలుగు చూసింది. రోజుల వ్యవధిలోనే చైనాని సర్వ నాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం 100కు పైగా దేశాల్లో కరోనా వ్యాపించింది. 4వేల మందిని బలితీసుకుంది. లక్ష మందికిపైగా కరోనా బారిన పడ్డారు. భారత్ లోనూ కరోనా విజృంభిస్తోంది. గురువారం(మార్చి 12,2020) నాటికి మన దేశంలో 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దీనికి వ్యాక్సిన్ కనుక్కోలేదు. దీంతో కరోనా గురించి అంతా ఆందోళన చెందుతున్నారు. కరోనా ప్రాణాంతకం కాకపోయినా ఏ మాత్రం నిర్లక్ష్యంగా చేసినా, అజాగ్రత్తగా ఉన్నా చంపేస్తుంది.