Ukraine-Russia : రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడో విడత చర్చల్లో పురోగతి

బెలారస్ కేంద్రంగా ఇరు దేశాల ప్రతినిధుల చర్చలు జరిగాయి. తమ షరతులకు అంగీకరిస్తే సైనిక చర్య నిలిపివేస్తామని రష్యా తెలిపింది. ఉక్రెయిన్ ఏ కూటమిలోనూ చేరవద్దని రష్యా డిమాండ్ చేసింది. 

Ukraine-Russia : రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడో విడత చర్చల్లో పురోగతి

Talks

Updated On : March 8, 2022 / 11:15 AM IST

Russia and Ukraine talks : రష్యా-యుక్రెయిన్ మధ్య జరిగిన శాంతి చర్చలు మరోసారి ఎటూ తేలకుండానే ముగిశాయి. బెలారస్ వేదికగా మూడోసారి సమావేశమైన ఇరుదేశాల ప్రతినిధులు… ఎలాంటి ముందడుగు వేయలేకపోయారు. చర్చల్లో కొంత పురోగతి సాధించినట్లు ఉక్రెయిన్ ప్రతినిధులు వెల్లడించారు. అయితే… చర్చలు సానుకూల దృక్పథంతో సాగాయని యుక్రెయిన్‌ ప్రతినిధి ప్రకటించగా… రష్యా ప్రతినిధి మాత్రం… తమ అంచనాలను రీచ్‌ కాలేకపోయామని చెప్పారు.

మూడోరౌండ్ చర్చల్లో ముఖ్యంగా యుక్రెయిన్‌ నగరాల నుంచి మానవతా కారిడార్ల ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చించారు. కీవ్, మరియుపోల్, ఖార్కివ్, సుమీ నుంచి ప్రజల తరలింపునకు కారిడార్లు ఏర్పాటు చేయాలన్న రష్యా ప్రతిపాదనను యుక్రెయిన్‌ తిరస్కరించింది. ఆ కారిడార్ల ద్వారా ప్రజలను రష్యాకు, బెలారస్‌కు మాత్రమే తరలిస్తామనడంతో అందుకు యుక్రెయిన్‌ అంగీకరించలేదు. దీనిని అనైతిక చర్యగా అభివర్ణించింది.

Ukrainians Emigrated : యుక్రెయిన్-రష్యా యుద్ధం.. 11 రోజుల్లో 17 లక్షల మంది యుక్రేనియన్లు పొరుగు దేశాలకు వలస

బెలారస్ కేంద్రంగా ఇరు దేశాల ప్రతినిధుల చర్చలు జరిగాయి. తమ షరతులకు అంగీకరిస్తే సైనిక చర్య నిలిపివేస్తామని రష్యా తెలిపింది. ఉక్రెయిన్ ఏ కూటమిలోనూ చేరవద్దని రష్యా డిమాండ్ చేసింది. దీంతో మరోసారి సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించారు. ఎల్లుండి మరోసారి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చలు జరుపనున్నారు.

అయితే.. ర‌ష్యా- యుక్రెయిన్ దేశాల మ‌ధ్య మ‌ధ్యవ‌ర్తిత్వం వ‌హించ‌డానికి.. తాము సిద్ధమ‌ంటూ చైనా కీల‌క ప్రక‌ట‌న చేసింది. ఇరు దేశాల మ‌ధ్య ఏర్పడ్డ సంక్షోభానికి తెర దించేందుకు తాము సిద్ధమ‌ని.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రక‌టించారు. ర‌ష్యా, యుక్రెయిన్ మ‌ధ్య బంధాలు చాలా బ‌లంగా ఉన్నాయని, ఇరు దేశాలు ప‌ర‌స్పర స‌హ‌కారం ఇచ్చి పుచ్చుకోవ‌డానికి కూడా అవ‌కాశాలున్నాయ‌న్నారు.