పిల్లలకు కరోనా వైరస్ సోకడం చాలా తక్కువ. సైంటిస్టులు చెబుతున్న కారణలేంటంటే!

వైరస్‌కి ఏముంటుంది జాలి. ఎవరైనా ఒకటే అన్నట్లు లేదు పరిస్థితి. దాదాపు కరోనా పేషెంట్లలో చిన్నపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంది. చైనీస్ సెంటర్లలో కరోనా నుంచి తప్పించేందుకు జాగ్రత్తలు చెప్తున్న రీసెర్చర్స్ ఇలా వెల్లడించారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ కథనం ప్రకారం.. సైంటిస్టులు ఇప్పటికీ కరోనా గురించి తెలుసుకుంటూనే ఉన్నారు.
చైనా మొత్తంలో 35వేల మంది పేషెంట్లు ఉండగా, 1400మంది చనిపోయారు. కానీ, పిల్లల్లో మాత్రం ఈ కరోనా చాలా తక్కువగా కనిపిస్తోంది. జనవరి 22 నుంచి నమోదైన కరోనా పేషెంట్ల వివరాలు పోలిస్తే 15ఏళ్ల కంటే తక్కువ వయస్సు వారే ఎక్కువగా ఉన్నారు. దాదాపు పిల్లలకు వైరస్ ఎఫెక్ట్ అవడం లేదు. లేదంటే చాలా తక్కువ స్థాయిలో ఇన్ఫెక్షన్‌కు గురవుతున్నారు.
బుధవారం వుహాన్‌లో పుట్టిన చిన్నారికి 30గంటల తర్వాత కరోనా సోకింది. తల్లి నుంచి వైరస్.. సంక్రమించడమే కానీ, నేరుగా పిల్లలకు సోకిన కేసులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
‘అన్నింటినీ చూస్తూనే ఉన్నా.. కొన్నిటికి కారణాలు తెలియడం లేదు. ఫలితాలను బట్టి చూస్తుంటే ఇది పెద్దలకే త్వరగా ఎఫెక్ట్ అవుతుంది. చిన్న పిల్లల హాస్పిటల్స్ కంటే పెద్ద వాళ్ల హాస్పిటల్స్ లోనే కరోనా పేషెంట్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనిపై ఆరోగ్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం పిల్లలు తక్కువగా చేతులు కడుక్కోవడం, తక్కువ సార్లు చేత్తో నోటిని మూసుకుంటూ ఉండటం, ఇతరులను ఎక్కువ సార్లు ముట్టుకోకుండా ఉండటం క్రిములను వ్యాపించకుండా చేస్తుంది.
మనం చిన్నారులను రక్షిస్తున్నామంటే అది చాలా మంచి విషయం. దాంతో పాటు అది దేశ జనాభాకు కూడా చాలా ఉపయోగపడే వార్త. ఒకవేళ ఇదే కొనసాగితే తర్వాతి జనరేషన్‌కు ప్రమాదం తక్కువగానే ఉంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్ లక్షణాలు ఇలా ఉన్నాయి. ఫ్లూ, జ్వరం, దగ్గు, తలనొప్పి, శ్వాస అందుకోకపోవడం, గొంతు మూసుకుపోవడం, శరీరంలో కాస్త వణుకు వస్తుంటాయి.
స్వర్గపురి వాహనంపై సిగరెట్ తాగుతూ.. బస్తీ బాలరాజు!