Liz Truss Poised To Become Next PM: నేటితో ముగియనున్న బ్రిటన్ ప్రధాని ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ.. భారత సంతతి నేత రిషి ఓడిపోయే అవకాశం?

బ్రిటన్ ప్రధాని ఎన్నికకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో ఈ నెల 5న కన్జర్వేటివ్‌ పార్టీ కొత్త అధినేత, బ్రిటన్ ప్రధాని పేరును ప్రకటిస్తారు. బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ ప‌ద‌వికి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. ఆ ప‌ద‌వికి పోటీ చేస్తోన్న ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ పోటీలో వెనకబడ్డారు. 

Liz Truss Poised To Become Next PM: నేటితో ముగియనున్న బ్రిటన్ ప్రధాని ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ.. భారత సంతతి నేత రిషి ఓడిపోయే అవకాశం?

Liz Truss Poised To Become Next PM

Updated On : September 2, 2022 / 11:48 AM IST

Liz Truss Poised To Become Next PM: బ్రిటన్ ప్రధాని ఎన్నికకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో ఈ నెల 5న కన్జర్వేటివ్‌ పార్టీ కొత్త అధినేత, బ్రిటన్ ప్రధాని పేరును ప్రకటిస్తారు. బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ ప‌ద‌వికి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. ఆ ప‌ద‌వికి పోటీ చేస్తోన్న ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ పోటీలో వెనకబడ్డారు. లిజ్‌ ట్రస్ తో కలిసి ఆయన తుది రేసులో నిలిచాక నిర్వహించిన పలు సర్వేలో ఈ విషయం తేలింది.

సునాక్ గెలిస్తే బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర లిఖిస్తారు. అయితే, లిజ్ ట్రస్ ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. వారిరువురూ దేశ వ్యాప్తంగా పర్యటించిన పలుసార్లు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మూడు టెలివిజన్ డిబేట్లలో పాల్గొన్నారు. ఇప్పటివరకు ఉన్న అంశాలను పరిశీలిస్తే బ్రిటన్ తదుపరి ప్రధానిగా లిజ్‌ ట్రస్ ఎన్నికయ్యే అవకాశాలే అధికంగా కనపడుతున్నాయి.

ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ సెప్టెంబరు 6న రాజీనామా లేఖను క్వీన్ ఎలిజబెత్ 2కు అధికారికంగా సమర్పించనున్నారు. 2,00,000 మంది టోరీ సభ్యుల పోస్టల్, ఆన్ లైన్ ఓటింగ్ ప్రక్రియ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమైంది. లిజ్ ట్రస్ కే మద్దతు అధికంగా వచ్చినట్లు స్పష్టమవుతోంది. అయితే, ప్రస్తుతం యూకే జీవన వ్యయం (కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌), ద్రవ్యోల్బణం పెరగడం వంటి సమస్యలు యూకే ఆర్థిక వ్యవస్థను దిగజార్చుతున్నాయి. దీంతో కొత్త ప్రధాని వాటిని సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

India exercising with Russia: అమెరికా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ రష్యా చేపట్టిన విన్యాసాల్లో పాల్గొన్న భారత్