సెల్ఫ్ ఐసోలేషనట: రబ్బరు బంతిలో నడుచుకుంటూ షాపింగ్‌కు వెళ్లిన మహిళ

లాక్ డౌన్ పీరియడ్ లో బయటకు రావడానికి ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని మాస్క్ లతో, గ్లౌజులతో సిద్ధమవుతున్నారు. లండన్ లోని ఓ మహిళ దీని కోసం వినూత్న ప్రయత్నం చేసింది. జోర్బ్ బాల్(రబ్బరు బంతి)లో నడుచుకుంటూ షాపింగ్ కు వెళ్లింది. నిత్యవసర వస్తువులు కొనుక్కునేందుకు హెర్నె బే అనే మహిళ ఈ ఫీట్ చేసిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షాపింగ్ మాల్ లోకి ఎంటరవగానే ఇతర కస్టమర్లు ఆమెకు సైడ్ ఇస్తూ సహకరించారు. ఆమె స్టోర్ లోకి వెళ్లిన తర్వాత ఓ వ్యక్తి తన వెంటే ఉండి కావలసినవన్నీ సమకూర్చి జాగ్రత్తలు తీసుకున్నాడు. షెల్ఫ్ లలో ఉన్న వస్తువులు తీసుకుంటూ ఉండగా ఆ వ్యక్తి పదేపదే ఆ బంతిని తుడుస్తూ ఆమెతో సంభాషణ జరుపుతూ కనిపించాడు.
ఆ వ్యక్తిని మహిళ గురించి అడగ్గా ఆమెకు జెర్మాఫోబియా ఉందని, సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉందని చెబుతున్నాడు. ఇతర కస్టమర్లు రబ్బరు బంతితో ఆమె షాపింగ్ కు రావడంతో ఆమెను చూసి నవ్వుకుంటున్నారు. షాపింగ్ చేసుకుని బయటకు వెళ్లిపోయిందని ఆమె కోసం ఇద్దరు ఎస్కార్ట్ లు కూడా వచ్చారని తెలిపారు.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ లలో వైరల్ అయిపోయింది. వేలలో వ్యూస్ సంపాదించుకుంటుంది. ఓ యూజర్ ఆ బంతిని ముట్టుకోకండి. తానేమీ గాలిలో ఎగరడం లేదు. నేలపై నడుస్తుంది. చెత్తంతా ఆ బంతికే అంటుకుని ఉంటుందని హెచ్చరిస్తుండగా మరో వ్యక్తి ఆ మహిళ కరోనా రాకుండా మంచి ఐడియా వేసిందంటూ పొగుడుతున్నాడు. మరో వ్యక్తి రోడ్డుపై ఉన్న కరోనాను బంతికి అంటించుకుని 3రోజుల వరకూ అందరికీ వ్యాప్తి చేయాలనుకుంటుందా అని ప్రశ్నిస్తున్నాడు.
Also Read | కరోనాపై తప్పుడు ప్రచారం : ఉద్యోగం పోగొట్టుకున్న ఇన్ఫోసిస్ ఉద్యోగి