PM Modi Saudi Tour: వాటే వెల్‌కమ్.. సౌదీలో ప్రధాని మోదీకి అదిరిపోయే స్వాగతం.. ఫైటర్ జెట్స్ తో.. వీడియో వైరల్
సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు వెళ్లారు.

PM Modi Saudi Tour: ప్రధాని మోదీకి సౌదీలో అదిరిపోయే వెల్ కమ్ లభించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రధాని మోదీకి వెల్ కమ్ చెప్పింది సౌదీ. ఫైటర్ జెట్స్ తో గ్రాండ్ గా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే.. రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-15 విమానాలు ఎస్కార్ట్ గా దానిని అనుసరించి గౌరవంగా స్వాగతించాయి.
దీనికి సంబంధించిన వీడియోను విదేశాంగశాఖ షేర్ చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు పడతాయని ఈ ఆత్మీయ స్వాగతం చాటిందనే అభిప్రాయం వ్యక్తం చేసింది విదేశాంగ శాఖ.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సౌదీ వెళ్లారు. ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి పలు కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. మోదీ, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ మధ్య ఇటీవల జరిగిన చర్చల తర్వాత ఇరుపక్షాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. భారత్, సౌదీ అరేబియాల మధ్య ఇప్పటికే బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది.
Also Read: భారత్‌తో పోలిస్తే.. ఈ దేశాల్లో బంగారం ధరలు చాలా తక్కువ.. అవి ఏవి, కారణం ఏంటి అంటే..
సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మంగళవారం ఉదయం సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, ప్రజల మధ్య సంబంధాలతో సహా రెండు దేశాలు పరస్పరం ప్రయోజనకరమైన, గణనీయమైన భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు.
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో జరిగే సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, రక్షణ సహకారం, ప్రాంతీయ భద్రత, కనెక్టివిటీ తదితర అంశాలపై ప్రధాని మోదీ చర్చించే అవకాశం ఉందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు సహకారాన్ని బలోపేతం చేయడానికి అనేక ఒప్పందాలను ఖరారు చేస్తాయని భావిస్తున్నారు. ఈ పర్యటనలో మోదీ, మహమ్మద్ బిన్ సల్మాన్ ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్య మండలి రెండవ సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తారని మిస్రీ చెప్పారు. సల్మాన్ సౌదీ ప్రిన్స్ తో జరిగే సమావేశంలో భారత యాత్రికుల కోటాతో సహా హజ్‌కు సంబంధించిన అంశాలపైనా ప్రధాని మోదీ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
As a mark of respect, Saudi fighter jets escorted PM Modi’s plane after it entered Saudi Arabian airspace… 🔥 pic.twitter.com/0hYVLzjC4b
— Mr Sinha (@MrSinha_) April 22, 2025
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here