రష్యా వ్యాక్సిన్‌ విడుదలపై దుమ్మెత్తిపోస్తున్న సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్‌ విడుదలపై దుమ్మెత్తిపోస్తున్న సైంటిస్టులు

Updated On : August 12, 2020 / 10:45 AM IST

హ్యూమన్ టెస్ట్ దశలో ఉందని చెప్పిన COVID-19 వ్యాక్సిన్ కు రెండు నెలల్లోనే రష్యా అప్రూవల్ ఇచ్చేసింది. ఇదెలా సాధ్యమైందంటూ ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయి టెస్టులు జరగకుండా వ్యాక్సిన్ రిలీజ్ చేస్తే ఎలా నమ్మాలని అడుగుతున్నారు. మహమ్మారి నుంచి బయటపడటానికి వ్యాక్సిన్ కనిపెట్టే క్రమంలో ప్రపంచంతో పోటీ పడి ట్రయల్స్ చేయాల్సి ఉన్నా రిలీజ్ చేసింది. ఇది కచ్చితంగా రష్యా తీసుకున్న రెక్లెస్ వైఖరేనంటూ విమర్శిస్తున్నారు.

‘రష్యా చాలా ఎక్కువ మందిపై ప్రయోగం చేయాలనుకుంటుంది’ అని బ్రిటన్ వార్విక్ బిజినెస్ స్కూల్ డ్రగ్ రీసెర్చ్ స్పెషలిస్ట్ ఏఫర్ అలీ అంటున్నారు. ఇంత వెంటనే సూపర్ ఫాస్ట్ అప్రూవల్ ఇస్తే సరిగా పనిచేయకపోతే ప్రతికూల ప్రభావాలు చూపుతాయని.. చాలా అరుదైన పని, సీరియస్ కూడా కావొచ్చని హెచ్చరించారు.

రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మాట్లాడుతూ.. ఇది మాస్కో గమాలేయా ఇన్‌స్టిట్యూట్ డెవలప్ చేసింది. ఇది సేఫ్. నా కూతుళ్లలో ఒకరికి దీనిని వాడాను కూడా. ఇది బాగా పనిచేస్తుందని తెలుసు. దృఢమైన ఇమ్యూనిటీ ఇస్తుంది. అవసరమైన పరీక్షలన్నీ చేశాం అని జాతీయ మీడియా ముందు వెల్లడించారు.

యూనివర్సిటీ కాలేజ్ లండన్ జెనెటిక్స్ ఇన్‌స్టిట్యూట్ నిపుణులు ఫ్రాంకోయిస్ బాలక్స్ .. ‘ఇది లెక్కలేని చర్య, మూర్ఖపు నిర్ణయం. వ్యాక్సిన్ టెస్టు చేయకుండా అందరిలోకి వదిలేయడం ధర్మం అనిపించుకోదు’ అని అన్నారు. రష్యా వ్యాక్సిన్ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందని ప్రచారం జరుగుతుంది.’ అని అన్నారు.

మామూలుగా వ్యాక్సిన్ అప్రూవ్ చేయడానికి చాలా మంది కావాలి. అంతమందికి టెస్టు చేయకుండానే అప్రూవ్ చేసేశారు. వ్యాక్సిన్ పేపర్స్ సైంటిఫిక్ విశ్లేషణకు పంపకుండా వ్యాక్సిన్ విడుదల చేయకూడదంటూ బ్రిటన్ నాటింగ్‌హామ్ యూనివర్సిటీ స్పెషలిస్ట్ కీత్ నీల్ అంటున్నారు.