Alaska Airways : పేలిన స్మార్ట్ ఫోన్..అత్యవసరంగా విమానం ల్యాండింగ్

ఓ విమానంలో స్మార్ట్ ఫోన్ పేలడంతో కలకలం రేపింది. దీంతో ఆ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు విమాన సిబ్బంది. ఈ ఘటన వాషింగ్టన్ లో చోటు చేసుకుంది.

Alaska Airways : పేలిన స్మార్ట్ ఫోన్..అత్యవసరంగా విమానం ల్యాండింగ్

Samsung Smartphone

Updated On : September 22, 2021 / 4:03 PM IST

Samsung Smartphone : ఈ మధ్య స్మార్ట్ ఫోన్లు పేలుతుండడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కారణంగా కొంతమంది చనిపోయిన సందర్భాలున్నాయి. మరికొన్ని ఘటనలో స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా..ఓ విమానంలో స్మార్ట్ ఫోన్ పేలడంతో కలకలం రేపింది. దీంతో ఆ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు విమాన సిబ్బంది. ఈ ఘటన వాషింగ్టన్ లో చోటు చేసుకుంది.

Read More : Anti-Taliban Fighters: వారి ముఖాలను నేలకు రుద్ది అఫ్ఘానిస్తాన్‌ను కాపాడుకుంటాం

అలస్కా 751 విమానం…128 మంది ప్రయాణీకులతో న్యూ ఓర్లీన్స్ నుంచి సీటెల్ కు ప్రయాణిస్తోంది. ప్రయాణీకులందరూ ఫోన్లు చూసుకుంటూ..కబుర్లు చెప్పుకుంటున్నారు. విమానం మెళ్లిగా ఆకాశం వైపు ఎగిరింది. కాసేపటికే…ఓ ప్రయాణీకుడి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ పేలి మంటలు వచ్చాయి. అక్కడున్న వారు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే విమాన సిబ్బంది అలర్ట్ అయ్యారు.

Read More : AP Corona : పిల్లలను స్కూళ్లకు పంపాలా వద్దా ? బడుల్లో కరోనా పంజా

మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో…కొంతమందికి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే సీటెల్ – టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. ప్రయాణీకులతో పాటు..సిబ్బందిని సురక్షితంగా బస్సులో తరలించారు. అనంతరం ఈ ఘటనపై విమానాశ్రాయ ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. పేలుడు ధాటికి స్మార్ట్ ఫోన్ పూర్తిగా దగ్ధమైంది. దగ్ధమైన ఫోన్ Samsung Galaxy A21గా తెలుస్తోంది.