Saudi Arabia : అప్పుడు అతివలకు..ఇప్పుడు17 ఏళ్ల అమ్మాయిలకు డ్రైవింగ్ పర్మిషన్

17 Years Can Obtain Driving Permits
Saudi Arabia 17 Years womens driving permits : మహిళల విషయంలో ఎన్నో ఆంక్షలు ఉన్న దేశం సౌదీ అరేబియా మరో కీలక నిర్ణయం తీసుకుంది.గతంలో మహిళలు కూడా డ్రైవింగ్ చేయవచ్చనే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. 2017 సెప్టెంబర్‌లో మహిళలకు డ్రైవింగ్ చేసే వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా 17 ఏళ్లు నిండిన యువతులకు కూడా డ్రైవింగ్ పర్మిట్ ఇవ్వనున్నామని వెల్లడించింది.
దీనికి సంబంధించి సౌదీ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ప్రకటన విడుదల చేసింది. 17 ఏళ్లు నిండిన యువతులు డ్రైవింగ్ పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ తాత్కాలిక డ్రైవింగ్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే విషయంలో కొన్ని నిబంధనలను విధించింది. దరఖాస్తు చేసుకునే యువతులకు మెడికల్ చెకప్ తప్పనిసరి అని పేర్కొంది.
దీని కోసం డ్రైవింగ్ స్కూళ్లలో పాస్‌పోర్ట్ సైజ్ 6 ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ డ్రైవింగ్ పర్మిషన ఏడాది పాటు చెల్లుబాటు అవుతుందని..ఆ తరువాత ఆ తాత్కాలిక పర్మిట్ ను 18 ఏళ్లు నిండిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్‌గా మార్చుకోవచ్చని సౌదీ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. కాగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే యువతులకు కొన్ని ప్రత్యేక షరతుల కూడా విధించింది.
అవేమిటంటే..మొదటిది దరఖాస్తు చేసుకునే సమయానికి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో ఆ యువతులపై డ్రగ్స్‌కు సంబంధించి ఎటువంటి కేసులు ఉండకూడదు. ఉంటే పర్మిట్ ఇవ్వటం కుదరదని స్పష్టంచేసింది. అలాగే డ్రైవింగ్‌కు ఇబ్బంది కలిగించే ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు ఉండి ఉంటే వాటిని క్లియర్ చేసుకున్నాకనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు సౌదీయేతరులు అయితే రెసిడెన్సీ పర్మిట్ తప్పనిసరి. అలాగే డ్రైవింగ్ స్కూళ్లలో నిర్వహించే థియేరిటికల్ టెస్టు పాస్ కావటం తప్పనిసరి..వీటి కోసం ఎటువంటి లాబీయింగులకు చేసుకోకుడదని స్పష్టంచేసింది.