Saudi Arabia: సౌదీ అరేబియాలో వంతెనను ఢీకొట్టిన బస్సు.. 20 మంది హజ్ యాత్రికుల మృతి ..

సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. వంతెను ఢీకొట్టిన బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది హజ్ యాత్రికులు మరణించారు. మరో 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Saudi Arabia: సౌదీ అరేబియాలో వంతెనను ఢీకొట్టిన బస్సు.. 20 మంది హజ్ యాత్రికుల మృతి ..

Saudi Arabia

Updated On : March 28, 2023 / 8:05 AM IST

Saudi Arabia: నైరుతి సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హజ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వంతెనను ఢీకొట్టింది. ఈ ఘటనతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 29 మందికి గాయాలయ్యాయి. అసిర్ ప్రావిన్స్, అభా నగరాన్ని కలిపే రహదారిపై ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తున్నవారంతా మక్కా వెళ్తున్నారు.

Saudi Arabia Floods : ఎడారి దేశం సౌదీ అరేబియాలో వరదలు .. బొమ్మల్లా కొట్టుకుపోతున్న కార్లు

సౌదీ సివిల్ డిఫెన్స్, రెడ్ క్రెసెంట్ అథారిటీ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే బస్సు ప్రమాదంలో మరణించిన వారి అవశేషాలను చూపించే పుటేజీని స్థానిక టీవీ ఛానెల్ ప్రసారం చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.