Saudi Arabia Floods : ఎడారి దేశం సౌదీ అరేబియాలో వరదలు .. బొమ్మల్లా కొట్టుకుపోతున్న కార్లు

ఎడారి దేశం సౌదీ అరేబియా వరదలతో అతలాకుతలమవుతోంది. సౌదీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో జెడ్డా నగరం జలసముంద్రంలా మారిపోయింది. రోడ్లు చిన్నస్థాయి సముద్రాన్ని తలపిస్తున్నాయి. వరదల తీవ్రతకు కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి.

Saudi Arabia Floods : ఎడారి దేశం సౌదీ అరేబియాలో వరదలు .. బొమ్మల్లా కొట్టుకుపోతున్న కార్లు

Saudi Arabia Floods

Saudi Arabia Floods : ఎడారి దేశం సౌదీ అరేబియా వరదలతో అతలాకుతలమవుతోంది. సౌదీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో జెడ్డా నగరం జలసముంద్రంలా మారిపోయింది. రోడ్లు చిన్నస్థాయి సముద్రాన్ని తలపిస్తున్నాయి. వరదల తీవ్రతకు కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి. గురువారం (నవంబర్24,2022) ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఉరుములు, మెరుపులతో ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. 17.97 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఈ స్థాయి వర్షాలు గతంలో ఎన్నడూ చూడని సౌదీ ప్రజలు…అంతకంతకూ ఆగకుండా కురుస్తున్న వాన చూసి ఆందోళన చెందారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సహాయక బృందాలను రంగంలోకి దించింది. వర్షాలు, వరదలతో ఇద్దరు మృతి చెందారు. వాహనాల్లో ఉన్న చాలా మంది వరదల్లో చిక్కుకుపోయారు.

గతంలో 2009, 2011లో సౌదీలో భారీ వర్షాలు కురిసాయి. అయితే అప్పుడు వర్షపాతం 11.1, 9 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయింది. తాజా వర్షాలతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. స్కూళ్లు మూసేశారు. మక్కా వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేసి..తర్వాత పునరుద్ధరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశించింది. జెడ్డాలోని వరదలకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరదల కారణంగా కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు ఆలస్యమయ్యాయి.