Netherlands : 4 వేల ఏళ్లనాటి స్మశాన వాటికలో 60 మంది పురుషులు, మహిళలు, పిల్లల అవశేషాలు ..
పురావస్తు శాస్త్రవేత్తలు నెదర్లాండ్‌లో తాజాగా జరిపిన తవ్వకాల్లో 4,000 ఏళ్ల నాటి స్మశాన వాటిక బయటపడింది. ఈ తవ్వకాల్లో 60 మంది పురుషులు, స్త్రీలు, పిల్లల అవశేషాలు బయటపడ్డాయట.

Netherlands
Netherlands : నెదర్లాండ్‌లో 4,000 ఏళ్ల నాటి ‘స్టోన్ హెంజ్’ స్మశాన వాటికను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీరు జరిపిన తవ్వకాల్లో 60 మంది పురుషులు, మహిళలు, పిల్లల అవశేషాలు బయటపడ్డట్లు తెలుస్తోంది.
డచ్ పురావస్తు శాస్త్రవేత్తలు జరిగిన పరిశోధనల్లో పురాతనమైన ‘స్టోన్ హెంజ్ ఆఫ్ నెదర్లాండ్స్’ గా పిలువబడే స్మశాన వాటికను కనుగొన్నారు. ఇక్కడ సౌర క్యాలెండర్‌గా పనిచేసే మట్టిదిబ్బ ఉందట. ఇక అస్థి పంజరాలు, మానవ పుర్రెలు, కాంస్య స్పియర్ హెడ్ వంటి విలువైన వస్తువులు ఇక్కడ బయట పడ్డాయట. రోటర్ డ్యామ్‌కు తూర్పున ఈ ప్రదేశంలో తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంత ప్రజలు ఆచార ప్రకారంగా మృతదేహాలను సమాధి చేసేవారట. ఊరేగింపులు వెళ్లే మార్గాల్లో స్తంభాల వరుసలు ఉన్నాయట.
Lab Grown Meat : కృత్రిమ మాంసం.. ల్యాబ్ మీట్ పై సీసీఎంబీ పరిశోధనలు
నెదర్లాండ్స్‌లో ఇప్పటి వరకు కనుగొనబడిన ఈ ప్రాంతంలోని ప్రజలు దాదాపు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారట. ఇక పురావస్తు శాస్త్రవేత్తలు రాతి, కాంస్య, ఇనుప యుగాలతో పాటు రోమన్ సామ్రాజ్యం, మరియు మధ్య యుగం నాటి 1 మిలియన్ కంటే ఎక్కువ తవ్వకాల వస్తువులను పరిశోధించడానికి 6 సంవత్సరాలు పట్టిందట. వీరి పరిశోధనల్లో బయటపడిన వస్తువులు డచ్ నేషనల్ మ్యూజికం ఆఫ్ యాంటిక్విటీస్‌లో ప్రదర్శించబడతాయి.