US Shooting Incident: అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

US Shooting Incident: అమెరికాలోని మిసిసిప్పీ రాష్ట్రం క్లే కౌంటీలో కాల్పుల కలకలం చెలరేగింది. ఆరుగురు మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది.

US Shooting Incident: అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

US Shooting Incident

Updated On : January 11, 2026 / 12:25 PM IST

US Shooting Incident: అమెరికాలోని మిసిసిప్పీ రాష్ట్రం క్లే కౌంటీలో కాల్పుల కలకలం చెలరేగింది. ఆరుగురు మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read : Cyber Crime: మాజీ ఐపీఎస్ భార్యకే టోకరా.. రూ. 2కోట్లు కొట్టేసిన సైబర్ క్రిమినల్స్.. మోసం జరిగిందిలా

ఎన్‌బీసీ న్యూస్‌కు అనుబంధ సంస్థ అయిన డబ్ల్యూటీవీఏ కథనం ప్రకారం.. మూడు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడని, ప్రజలకు ఇక ఎలాంటి ముప్పు లేదని క్లే కౌంటీ షెరీఫ్ ఎడీ స్కాట్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే, ప్రాణనష్టం ఎంత జరిగిందన్న దానిపై ఆయన స్పష్టంగా వెల్లడించ లేదు. డబ్ల్యూటీవీఏ మాత్రం ఆరుగురు మృతి చెందినట్లు తెలిపింది.

ఈ ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు షెరీఫ్ స్కాట్ గానీ, ఆయన కార్యాలయ సిబ్బంది గానీ ఇప్పటివరకు స్పందించలేదు. మృతులు, వారి కుటుంబాల కోసం ప్రార్థించండి అని స్కాట్ ఫేస్‌బుక్‌లో విజ్ఞప్తి చేశారు.

మిసిసిప్పీ రాష్ట్రంలోని ఈశాన్య భాగంలో క్లే కౌంటీ ఉంది. ఇది అలబామా రాష్ట్ర సరిహద్దుకు సమీపంగా ఉండే కౌంటీగా గుర్తింపు పొందింది. జనాభా సుమారు 20 వేల వరకు ఉంటుంది.