Viral Video: బీచ్‌లో తలకిందులుగా కూలిపోయిన విమానం.. వీడియోలో రికార్డైన ఘటన

ఇద్దరు మాత్రమే ప్రయాణించగలిగే చిన్న విమానం ఒకటి సముద్ర తీరాన తలకిందులుగా కూలిపోయింది. ఈ ఘటన అమెరికాలోని, లాస్ ఏంజెల్స్‌లో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ ఘటనను కొందరు వీడియో తీశారు.

Viral Video: బీచ్‌లో తలకిందులుగా కూలిపోయిన విమానం.. వీడియోలో రికార్డైన ఘటన

Updated On : December 23, 2022 / 8:43 PM IST

Viral Video: అమెరికాలోని బీచ్‌లో ఒక చిన్న విమానం కూలిపోయింది. ఈ ఘటన లాస్ ఏంజెల్స్‌లో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ ఘటనను అక్కడివాళ్లు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో అక్కడ వైరల్ అవుతోంది.

Nasal Vaccine: నేటి నుంచి నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి.. అనుమతించిన కేంద్రం

ఇద్దరు మాత్రమే ప్రయాణించగలిగే, సింగిల్ ఇంజిన్ కలిగిన చిన్న విమానం ఒకటి లాస్ ఏంజెల్స్‌లోని శాంటా మోనికా ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయింది. ఈ విమానం మాలిబు వెళ్లాల్సి ఉంది. అయితే, విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇంజిన్ సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కు తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు తెలియజేశారు. అయితే, విమానాన్ని ఎయిర్‌పోర్టు తేవడం సాధ్యపడలేదు. దీంతో విమానాన్ని బీచ్‌లో ల్యాండ్ చేస్తామని పైలట్లు అధికారులకు తెలిపారు. అది చాలా రిస్క్ అని వాళ్లు హెచ్చరించారు. అయితే, తమకు మరో మార్గం లేకపోవడంతో విమానాన్ని బీచ్‌లో దించేందుకు ప్రయత్నించారు. ఈలోగానే విమానం పసిఫిక్ సముద్రం ఒడ్డున కూలిపోయింది.

Kamal Haasan: ‘భారత్ జోడో యాత్ర’లో చేరనున్న కమల్ హాసన్.. ఢిల్లీలో రాహుల్‌తో కలిసి పాదయాత్ర

బీచ్‌లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగానే నీళ్లలో పడిపోయింది. అనంతరం కొద్ది దూరం దూసుకెళ్లి తలకిందులుగా పడిపోయింది. వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది, విమానంలోని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనను అక్కడి వాళ్లు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో అక్కడ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Frank Deville (@fthemagician)