Spain COVID-19 : స్పెయిన్‌లో 90,000 కొవిడ్ మ‌ర‌ణాలు..కొత్త‌గా 3లక్షల పాజిటివ్ కేసులు

స్పెయిన్‌లో కోవిడ్ మరణాలు 90 వేల‌కు చేరుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Spain COVID-19 : స్పెయిన్‌లో 90,000 కొవిడ్ మ‌ర‌ణాలు..కొత్త‌గా 3లక్షల పాజిటివ్ కేసులు

Spain Covid 19

Updated On : January 11, 2022 / 12:32 PM IST

COVID-19 deaths top 90,000 in Spain : దక్షిణ ఐరోపా ఖండంలోని స్పెయిన్‌లో కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. భారీగా పాజిటివ్ కేసులు నమోదు కావటమే కాదు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. స్పెయిన్ దేశ వ్యాప్తంగా కోవిడ్ మరణాలు 90 వేల‌కు చేరాయని స్పెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్ల‌డించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 202 మరణాలు సంభవించాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read more : Corona Delhi : ఢిల్లీ జైలులో 114, తీహార్ జైలులో 76 మందికి కరోనా

క‌రోనా మొద‌టి వేవ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 90,136 మంది మ‌ర‌ణించారని.. గ‌త శుక్ర‌వారం (జనవరి 7నుంచి 10 వరకు) సోమ‌వారం వ‌ర‌కు 202 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

కరోనా మరోసారి విజృంభిస్తున్నాయి. స్పెయిన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 74,57,300 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా..72 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 2,92,394 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయని తెలిపింది. 23.58 శాతం మంది రోగులు ఇంటెన్సివ్ కేర్ లో చేరి చికిత్స పొందుతున్నారని..13.4 శాతం మంది బాధితులు నార్మల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న‌ాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

Read more : Coronavirus: భారత్‌లో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు

కేసులు పెరుగుతున్న క్రమంలో నియంత్రించే భాగంగా స్పెయిన్ ప్రభుత్వం 5 నుంచి 16 ఏళ్ల వ‌యసున్న 33,50,000 మందికి క‌రోనా టీకా వేశామని ప్ర‌ధాని పెడ్రో షాంచెజ్ తెలిపారు. క‌రోనా నివార‌ణ‌కు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామని తెలిపారు.