చెప్పినట్లుగానే హమాస్ టాప్ లీడర్లను లేపేసిన ఇజ్రాయెల్..! ఇక శత్రుశేషం లేనట్లేనా?

ఇప్పుడు ఈ మిలిటెంట్ గ్రూప్ ను ముందుండి నడిపించేది ఎవరు? అనే చర్చ మొదలైంది.

చెప్పినట్లుగానే హమాస్ టాప్ లీడర్లను లేపేసిన ఇజ్రాయెల్..! ఇక శత్రుశేషం లేనట్లేనా?

Yahya Sinwar Killing (Photo Credit : Google)

Updated On : October 19, 2024 / 1:39 AM IST

Yahya Sinwar Killing : ఇజ్రాయెల్ అన్నంత పని చేస్తోంది. హమాస్ పెద్ద తలకాయలను ఒక్కొక్కరిని వరుస పెట్టి ఏరిపారేస్తోంది. ఎక్కడ తల దాచుకున్నా వెతికి మరీ పట్టుకుని చంపేస్తోంది. ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా.. లెక్క చేయడం లేదు. సైలెంట్ గా వచ్చి బీభత్సం సృష్టిస్తోంది. వైమానికి దాడులతో విరుచుకుపడుతోంది. శత్రువులు పలానా బిల్డింగ్ లో ఉన్నట్లు తెలిస్తే చాలు.. క్షణాల్లో ఆ భవానాన్ని నేలమట్టం చేసేస్తోంది. తాజాగా హమాస్ బిగ్ బాస్ సిన్వర్ ను హతమార్చి విజయగర్వంతో ఊగిపోతోంది ఇజ్రాయెల్. ఇంతకీ ఎవరీ సిన్వర్? ఎందుకీ వార్?

సిన్వర్ హత్యతో శత్రుశేషం ఖతమైనట్లేనని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే, హమాస్ మిలిటెంట్లకు నెతన్యాహు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తమ బందీలను వదిలేస్తే మీ జోలికి రాము అని చెప్పారు. మరి నెతన్యాహు ఇచ్చిన ఆఫర్ కి హమాస్ తలొగ్గుతుందా? లేదంటే దెబ్బకు దెబ్బ తీసేందుకు వ్యూహాలు రచిస్తుందా? అదే నిజమైతే సిన్వర్ సీటును ఎవరు భర్తీ చేస్తారు? ఇజ్రాయెల్ కు ఎదురొడ్డి నిలబడే సత్తా ఎవరికి ఉంది?

సిన్వర్ ను ఇజ్రాయెల్ లేపేయడంతో హమాస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడిలో టాప్ లీడర్లు ఒక్కొక్కరిగా హతమయ్యారు. ఇప్పుడు ఈ మిలిటెంట్ గ్రూప్ ను ముందుండి నడిపించేది ఎవరు? అనే చర్చ మొదలైంది. సిన్వర్ సీటులో కూర్చునే అర్హత ఎవరికి ఉందనే లెక్కలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. సిన్వర్ బాధ్యతలను హమాస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మహమ్మద్ అల్ జహర్ స్వీకరించే అవకాశం ఉందంటూ వార్తలొచ్చాయి.

సిన్వర్ సోదరుడు మహమ్మద్ సిన్వర్ పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తోంది. యాహ్యా సిన్వర్ లానే మహమ్మద్ సిన్వర్ కూడా హమాస్ మిలిటరీ వింగ్ లో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్నాడు. అతడు నాయకత్వ బాధ్యతలు చేపడితే గ్రూపు వ్యూహాలు యధావిధిగా కొనసాగుతాయని భావిస్తున్నారు. అయితే, శాంతి చర్చలు మరింత సవాల్ గా మారొచ్చని అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, సిన్వర్ ను హతం చేసిన ఇజ్రాయెల్.. హమాస్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. హమాస్ ఆయుధాలను వదిలేసి, బందీలుగా పట్టుకున్న ఇజ్రాయెల్ పౌరులను తిరిగి పంపిస్తే.. ఈ యుద్ధం వెంటనే ముగుస్తుందన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.

 

Also Read : దావూద్‌కి, లారెన్స్ బిష్ణోయ్‌కి పోలికలు ఏంటి? బాలీవుడ్‌ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు?