ట్రంప్ విజయం భారత్ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? అమెరికాలో మనోళ్ల పరిస్థితి ఏంటి?
ఇదే జరిగితే అమెరికాలో ఉన్న భారతీయులు 10 లక్షల మందిపై ప్రభావం చూపించే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి.

Donald Trump : ట్రంప్ రికార్డ్ విజయం సాధించారు. ఆయన గెలుపుతో అసలు మనకేంటి. ట్రంప్ విజయం భారత్ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది. ట్రంప్ 2.ఓలో భారత్, అమెరికాల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి. సుంకాల రారాజు అంటూ భారత్ ను టార్గెట్ చేసిన ట్రంప్.. మన మార్కెట్ టార్గెట్ గా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. చైనా, పాకిస్తాన్ విషయంలో ట్రంప్ వైఖరి ఎలా ఉండబోతోంది. అసలేం జరగబోతోంది?
అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మన దేశంపై ప్రభావం ఏంటి అనే సంగతి ఎలా ఉన్నా.. అమెరికాలో మనోళ్ల పరిస్థితి ఏంటా అనే చర్చ జరుగుతోంది. పుట్టుకతో వచ్చే పౌరసత్వం విషయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఇది అమెరికాలో ఉన్న భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? కొత్త రూల్ తో తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా?
అమెరికాకు సక్రమంగానో, అక్రమంగానో వలస వెళ్లి స్థిరపడాలి అనుకునే వారు కోట్లాది మంది ఉంటారు. దీంతో ప్రతీసారి దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఇది ప్రధాన అంశంగా ఉంటూ వస్తోంది. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపించింది. అయితే, మరిం బలంగా వినిపించింది. వివాదం రేపింది. తాను అధికారంలోకి వస్తే అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన వారిని వెనక్కి పంపుతానని ప్రచారంలో క్లియర్ కట్ గా చెప్పేశారు ట్రంప్. ఇప్పుడు గెలిచారు. దీంతో ఆయన ఏం చేస్తారా? నిర్ణయాలు ఎలా ఉంటాయా? అనే భయాలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. మిగతా నిబంధనల సంగతి ఎలా ఉన్నా.. పిల్లలకు ఉన్న జనన హక్కు విధానాన్ని సమీక్షిస్తామని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇది భారతీయుల మీద భారీగా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది.
తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు అమెరికా పౌరులైనా అయి ఉండాలి. లేదంటే గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. అప్పుడే పిల్లలకు అమెరికా పౌరసత్వం ఇవ్వాలనే నిబంధన విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే అమెరికాలో ఉన్న భారతీయులు 10 లక్షల మందిపై ప్రభావం చూపించే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి. 2022 జనాభా లెక్కల ప్రకారం అమెరికాలో 40 లక్షల మంది భారతీయులు ఉంటే అందులో 34 శాతం అంటే దాదాపు 16 లక్షల మంది అమెరికాలో జన్మించిన వాళ్లే. ఈ 16 లక్షల మందిలో చాలా మందికి పౌరసత్వ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.
Also Read : ట్రంప్ విజయంపై రష్యా రియాక్షన్.. ఉక్రెయిన్ యుద్ధంపై క్రెమ్లిన్ స్పందన!