Srilanka Crisis : దేశం వదిలిపోయేందుకు గొటబాయ సోదరుల యత్నం..నిషేధం విధించిన సుప్రీంకోర్టు
దేశం వదిలిపోయేందుకు గొటబాయ సోదరుల యత్నాలు చేస్తున్నారు. దీంతో వారు దేశం వదిలిపోకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది.

Sc Bans Mahinda..basil Rajapaksa Leaving Country Without Permission
SC Bans Mahinda..Basil Rajapaksa Leaving Country Without Permission : శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వదిలిపారిపోయిన విషయం తెలిసిందే. దేశం ఈ గతి పట్టాడానికి..సంక్షోభంలో కూరుకుపోవటానికి కారణం గొటబాయ కుటుంబ పాలనే కారణమని మండిపడుతున్న లంకేయులు పదవుల్లో ఉన్న గొటబాయ సోదరులు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గొటబాయ కుటుంబం అంటేనే అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నారు. ఈక్రమంలో గొటబయ సోదరులు కూడా దేశం వదిలిపారిపోయేందుకు యత్నాలు చేస్తున్నారు. దీంతో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వారు దేశం వదలిపోకుండా నిషేధం విధించింది. వారిని చక్రబంధంలో బంధించేసింది.
శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స, మాజీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్స జులై 28 వరకు దేశాన్ని వీడి వెళ్లరాదని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. నిరసనకారులపై దాడులు..దేశ ఆర్థిక సంక్షోభానికి సంబంధించి వీరిపై జూన్ 17న న్యాయస్థానంలో కేసు దాఖలైంది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం రాజపక్స సోదరులు విదేశాలకు వెళ్లరాదని కోర్టు సుస్పష్టం చేసింది. బసిల్ రాజపక్స గత సోమవారం (11,2022) రాత్రి విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే వీరు సోదరుడు..శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స..తొలుత మాల్దీవులకు, ఆ తర్వాత సింగపూర్‌కు పరారైన విషయం తెలిసిందే.
Also read : Sri Lanka: ఎట్టకేలకు అధ్యక్ష పదవికి గొటబాయ రాజపక్స రాజీనామా.. శ్రీలంకలో సంబరాలు
గొటబాయ పరారీతో ఆయన సోదరులు ఇప్పుడు చక్రబంధంలో చిక్కుకుపోయారు. గొటబాయ సోదరుల్లో మహీంద రాజపక్స మొన్నటివరకు శ్రీలంక ప్రధానిగా పనిచేసిన సంగతి తెలిసిందే. గొటబాయ మరో సోదరుడు బసిల్ రాజపక్స శ్రీలంక ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. దేశంలో తాండవిస్తున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం క్రమంలోమహీంద ప్రధాని పదవికి రాజీనామా చేయగా… ఆయన స్థానంలో రణిల్ విక్రమసింఘే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బసిల్ కూడా ఆర్థిక మంత్రిగా రాజీనామా చేశారు.
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి రాజపక్స సోదరులే ప్రధాన కారణమంటూ ఆ దేశ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గొటబాయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ కొలంబోలోని అధ్యక్ష నివాసాన్ని ప్రజలు ముట్టడించారు. ఈ పరిస్థితిని ముందుగానే పసిగట్టిన గొటబాయ రాత్రికి రాత్రి మాల్దీవులకు వెళ్లిపోయారు. అక్కడ కూడా ఆయనకు నిసనలే ఎదురయ్యాయి. మాల్దీవుల్లో నివసిస్తున్న లంకవాసులు గొటబయను అక్కడ ఉండనివ్వవద్దని తిరిగి పంపించివేయాలను డిమాండ్ చేస్తూ రాజధాని మాలే వీధుల్లో నిరసనలు చేపట్టారు. దీంతో గొటబయ మాలే నుంచి సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్ చేరిన తర్వాతే ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. గొటబాయ రాజీనామాతో శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమ సింఘే ప్రమాణం చేశారు.
Also read : Singapore: గొటబాయ రాజపక్సకు మేము ఆశ్రయం ఇవ్వలేదు: సింగపూర్ ప్రభుత్వం
గొటబాయ పరారీ క్రమం ఆయన సోదరులు మహీంద, బసిల్‌లు కూడా దేశం వదిలి పారిపోయే అవకాశముందని గ్రహించిన లంక సుప్రీంకోర్టు వారిద్దరూ దేశం దాటిపోకుండా నిషేధం విధించింది. ఈ క్రమంలో ఈ నెల 28 వరకు మహీంద, బసిల్‌లు దేశం వదిలిపోకుండా ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఇదిలా ఉంటే… గొటబాయ కంటే ముందుగానే దేశం దాటి పోయేందుకు యత్నించిన బసిల్ యత్నాలను లంక ప్రజలు అడ్డుకున్నారు.