తమిళనాడు సీఎం స్టాలిన్ మార్నింగ్ వాక్.. స్వీట్ షాపులోకి వెళ్లి ఏం చేశారంటే? వీడియో వైరల్

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ వినూత్న రీతిలో ప్రచారంలో పాల్గొన్నారు.

తమిళనాడు సీఎం స్టాలిన్ మార్నింగ్ వాక్.. స్వీట్ షాపులోకి వెళ్లి ఏం చేశారంటే? వీడియో వైరల్

Tamil Nadu CM Stalin

Tamil Nadu CM Stalin : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ వినూత్న రీతిలో ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం తంజావూరు జిల్లాలోని మార్నింగ్ వాక్ లో పాల్గొన్న స్టాలిన్.. రోడ్డు పొడవునా వేచిఉన్న ప్రజలతో మాట్లాడుకుంటూ ముందుకు సాగారు. ఈ క్రమంలో.. యువకులు, పిల్లలు స్టాలిన్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా స్టాలిన్ ఓపిగ్గా వారితో సెల్ఫీలు దిగారు. అనంతరం స్థానిక స్టేడియంలో వాలీబాల్ ఆడారు. అక్కడి నుంచి రామరాజు మార్కెట్ వద్దకు వెళ్లి వ్యాపారులు, ప్రజలతో ముచ్చటించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓ స్వీట్ షాపులోకి వెళ్లి కప్పులో టీ తాగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tamil Nadu CM Stalin

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తంజావూరు నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి మురసోలి, కమ్యూనిస్టు పార్టీకి చెందిన నాగపట్నం అభ్యర్థి సెల్వరాజ్ లకు ఓట్లు వేయాలని కోరుతూ సీఎం స్టాలిన్ శనివారం సాయంత్రం తిరువారూరు జిల్లా కోరడచ్చేరిలో ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి తంజావూరు చేరుకొని అక్కడే ఓ ప్రైవేట్ హాస్టల్ లో విశ్రాంతి తీసుకున్నారు. ఉదయాన్నే స్థానిక నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపక్కనే ఓ స్వీట్ షాపులోకి వెళ్లి పార్టీ సభ్యులతో కలిసి స్టాలిన్ టీ తాగారు.

Also Read : జైలు నుంచే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాలనపై మండిపడ్డ బీజేపీ ఎంపీ మనోజ్ తివారి