United Nations : ఐరాస భద్రతా మండలిలో ఐదు దేశాలకు తాత్కాలిక సభ్యత్వం

ఇక ఐదో సభ్య దేశంగా బెలారస్ కు స్లొవేనియాకు మధ్య పోటీ నెలకొనగా స్లోవేనియాకు 153 ఓట్లు వచ్చాయి. బెలారస్ కు 38 ఓట్లు మాత్రమే వచ్చాయి.

United Nations : ఐరాస భద్రతా మండలిలో ఐదు దేశాలకు తాత్కాలిక సభ్యత్వం

United Nations (1)

Updated On : June 7, 2023 / 11:44 AM IST

United Nations Security Council : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఐదు దేశాలకు తాత్కాలిక సభ్యత్వం లభించింది. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా అల్జీరియా (Algeria), గయానా (Guyana), సియెర్రా లియోన్, స్లొవేనియా, దక్షిణ కొరియా (South Korea) ఎన్నికయ్యాయి. రేండేళ్ల కాలపరిమితికి గానూ ఐరాస సాధారణ సభ తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకుంది.

అయితే, ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంలో పాలుపంచుకుంటున్న బెలారస్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి సభ్యత్వం ఇచ్చేందుకు సభ్య దేశాలు నిరాకరించాయి. కాగా, కొత్తగా ఎన్నికైన దేశాలు 2014, జనవరి1న బాధ్యతలు స్వీకరించనున్నాయి. తాత్కాలిక సభ్య దేశాల ఎంపిక కోసం జరిగిన ఓటింగ్ లో గయానాకు 191 ఓట్లు రాగా, సియోర్రా లియోన్ 188, అల్జీరియా 184, దక్షిణ కొరియాకు 180 ఓట్లు పోల్ అయ్యాయి.

South Central Railway: ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో.. 9వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు

కాగా, ఐదో సభ్య దేశంగా బెలారస్ కు స్లొవేనియాకు మధ్య పోటీ నెలకొనగా స్లోవేనియాకు 153 ఓట్లు వచ్చాయి. బెలారస్ కు 38 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా, అల్బేనియా, బ్రెజిల్, గబాన్, ఘనా, యూఏఈ దేశాల పదవీ కాలం ఈ ఏడాది చివరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ ఐదు దేశాలకు తాత్కాలిక సభ్యత్వం కల్పించారు.

ఐరాస భద్రతా మండలిలో 15 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. వాటిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు కాగా, 10 అశాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ ఉంది. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు శాశ్వత సభ్య దేశాలు. వీటికి వీటో హక్కు ఉంటుంది.