Tesla : కొత్త దాని జోలికెళ్లొద్దు.. వాహనదారులకు టెస్లా విన్నపం
టెస్లా కార్లలో కలకలం రేగింది. సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు వచ్చాయి. దీంతో టెస్లా అలర్ట్ అయ్యింది. వాహనదారులకు కీలక విన్నపం చేసింది.

Tesla
Tesla : టెస్లా కార్లలో కలకలం రేగింది. సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు వచ్చాయి. దీంతో టెస్లా అలర్ట్ అయ్యింది. వాహనదారులకు కీలక విన్నపం చేసింది. కార్ల సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌లో(బీటా వెర్షన్) భాగంగా కొత్త వెర్షన్‌కు బదులుగా పాత వెర్షన్ వాడాలని సూచించింది. తాజాగా రిలీజ్ చేసిన ఎఫ్ఎస్‌డీ(ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్) 10.3 బీటా వెర్షన్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు ఉండడంతో.. 10.2 ఎఫ్‌ఎస్‌డీ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను వాడాలంది.
Smart Phone : రాత్రి నిద్రకు ముందు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా…అయితే జాగ్రత్త!..
సెల్ఫ్ డ్రైవింగ్ బీటా సాఫ్ట్‌వేర్ తాజా వెర్షన్‌ను అక్టోబర్ 24న టెస్లా విడుదల చేసింది. విడుదలైన ఒక రోజులోనే… కొల్లిజన్ వార్నింగ్స్ విషయంలో సమస్యలు ఉన్నట్టు వినియోగదారులు టెస్లా దృష్టికి తీసుకెళ్లారు.
Laptops Online: అద్భుతమైన ఆఫర్లలో ల్యాప్‌టాప్స్.. అమెజాన్‌లో బెస్ట్ డీల్స్ ఇవే!
బీటా వినియోగదారుల వీడియో పోస్టింగ్‌ల ప్రకారం, టెస్లా వాహనాలు తాజా 10.3 సాఫ్ట్‌వేర్‌తో తక్షణ ప్రమాదం లేనప్పుడు ఫార్వర్డ్ కొలిషన్ హెచ్చరికలను పదేపదే అందిస్తున్నట్లు గుర్తించారు. కొన్ని వాహనాలు కూడా కారణం లేకుండా అటోమేటిక్ గా బ్రేకులు వేసినట్లు వినియోగదారులు సోషల్ మీడియా పోస్టుల్లో తెలిపారు.
కంపెనీ రిలీజ్ చేసిన ఎఫ్‌ఎస్‌డీ బీటా వెర్షన్‌లో సమస్యలు ఉన్నట్లు టెస్లా క్వాలిటీ కంట్రోల్ టీమ్ గుర్తించిందని, వాటికి వెంటనే పరిష్కారం చూపుతామని టెస్లా అధినేత ఎలన్ మస్క్ తెలిపారు.