World Rose Day 2021: ప్రపంచ గులాబీ దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర..

ప్రపంచ గులాబీ దినోత్సవం. గులాబీ అంటే అందరికి ప్రేమను వ్యక్తంచేసే అద్భుతమైన అందమైన పువ్వుగా మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ గులాబీ అంటే ప్రేమను తెలియజేసే నిర్వచనం మాత్రమేకాదు..

World Rose Day 2021: ప్రపంచ గులాబీ దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర..

World Rose Day 2021

World Rose Day 2021 Special : సెప్టెంబర్ 22. ప్రపంచ గులాబీ దినోత్సవం. గులాబీ అంటే అందరికి ప్రేమను వ్యక్తంచేసే అద్భుతమైన అందమైన పువ్వుగా మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ గులాబీ అంటే ప్రేమను తెలియజేసే నిర్వచనం మాత్రమేకాదు..గులాబీ రంగు క్యాన్సర్ మహమ్మారికి గుర్తు కూడా. క్యాన్సర్‌. ఎంతోమందిని పొట్టన పెట్టుకుంటోంది. ప్రతీ ఏటా వేలాదిమంది క్సాన్సర్ కు బలైపోతున్నారు.

సాధారణ వ్యక్తులే కాదు..ఎంతోమంది ప్రముఖులు సైతం ఈ మహమ్మారి బారిన పడ్డారు. క్యాన్సర్ పై పోరాడి విజయం సాధించినవారు క్యాన్సర్ పేషెంట్లకు స్ఫూర్తిగా నిలిచారు. కాగా వైద్య రంగంలో వస్తున్న పెను మార్పులతో గతంతో పోలిస్తే అందుబాటులోకి వచ్చిన చికిత్సలతో క్యాన్సర్‌ని మొదటి దశలో గుర్తించి బయట పడే అవకాశాలుండటం మంచి పరిణామం. అంతేకాదు క్యాన్సర్ రోగులు కూడా త్వరగా కోలుకునే మెడిసిన్స్ రావటం మరో మంచి విషయం. కానీ ఎంత వైద్యం అందుబాటులోకి వచ్చినా..ఈ మహమ్మారిని జయించటం..అంటే మాటలు కాదు. మెరుగైన వైద్యంతో పాటు మనోధైర్యం చాలా ముఖ్యం. కానీ క్యాన్సర్ సోకింది అంటే మానసికంగా కృంగిపోయేవారే ఎక్కువ. కారణం అవగాహన లేకపోవటంతో పాటు ఆ వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవటం కూడా కారణమేనని విషయం గుర్తించాలి.

Read more : క్యాన్సర్ ను జయించి : ముంబైకి చేరుకున్న రిషీ కపూర్

క్యాన్సర్‌ అనగానే జీవితం మీద ఆశ వదులుసుకునేంతగా అందర్నీ భయబ్రాంతులకు గురు చేస్తుందనడంలో సందేహం లేదు. అందుకే ప్రపంచ దేశాలన్ని ముందుకు వచ్చి క్యాన్సర్‌ని జయించే విధంగా ప్రజలకు మనోధైర్యంతో పాటు చైత్యవంతులను చేసే విధంగా అడుగులు వేయాలని సంకల్పించాయి. దానిలో భాగంగానే ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ రోజ్‌ డే అనే ప్రతిపాదన తీసుకువచ్చింది. దీంతో ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 22న ప్రపంచ గులాబీ దినోత్సవం (వరల్డ్‌ రోజ్‌ డే)ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు.

ప్రపంచ గులాబీ దినోత్సవం వెనుక చరిత్ర..
ప్రపంచ గులాబీ దినోత్సం వెనుక ఉన్న చరిత్ర ఏమిటంటే..కెనడాకు చెందిన మెలిండా రోజ్‌ అనే అమ్మాయి గౌరవార్థం క్యాన్సర్‌ రోగుల కోసం ప్రపంచ గులాబీ దినోత్సవం జరుపుకుంటారు. మెలిండా రోజ్‌ 12 సంవత్సరాల వయసులో అరుదైన బ్లడ్‌ క్యాన్సర్‌ అస్కిన్స్‌ ట్యూమర్‌తో బారినపడింది. ఆ వ్యాధితో ఆమె ఎంతో బాధపడేది. ఈక్రమంలో ఆమెను ఆ వ్యాధి నిలువెల్లా తినేసింది. కేవలం కొన్ని వారాలు మాత్రమే బ్రతుకుతుందని డాక్టర్లు తెలిపారు.

Read more : CT Scans Cause Cancer : సిటీ స్కాన్‌తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం

కానీ మనోధైర్యం ఉంటే ఆయుషును కూడా పెంచుకోవచ్చని ఆ చిన్నారి నిరూపించింది. ఓ పక్కన క్యాన్సర్ తన శరీరాన్ని కబళిస్తున్నా..మనోధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. కొన్ని వారాలు మాత్రమే జీవిస్తుందని చెప్పిన తరువాత కూడా మెలిండా రోజు ఆరు సంవత్సరాలు జీవించింది. అది ఆమె మానసిక ధైర్యానికి నిదర్శమని చెప్పి తీరాల్సిందే.

అంత చిన్న వయస్సులో కూడా మెలిండా తను క్యాన్సర్ తో పోరాడుతు కూడా తనలా క్యాన్సర్‌తో బాధపడుతున్నవారిని తను స్వయంగా రాసి కవితలతో..చక్కటి వ్యాఖ్యాలతో నింపిన మెసేజ్ లతో ధైర్యాన్ని నింపేది. ఉత్సాహంగా మాట్లాడుతు..ఆ అమ్మాయికి అసలు జబ్బు ఉందా? అనుకునేలా చేసేది. ప్రాణాలు హరించే క్యాన్సర్ తో పోరాడటమే కాకుండా బాధితుల్లో మనోశక్తిని, ధైర్యాన్ని నింపడం ఏదో రోగం వచ్చిందని కృంగిపోతుమే కాక చనిపోయేంత వరకు సంతోషంగా ఎలా ఉండాలో చేసి చూపించింది.

Read more : Tollywood : క్యాన్సర్‌‌తో పోరాడుతున్న అభిమానితో మాట్లాడిన ప్రభాస్

తాను అంత చిన్న వయసులో ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ మరోవైపు తనలా బాధపడుతున్న వారి పట్ల ఆమె కనబర్చిన మనోధైర్యానికి గుర్తుగా..ఆమెలా క్యాన్సర్ రోగులు ధైర్యంగా ఉండాలనే సందేశాన్ని చాటి చెబుతు..మెలిండా రోజ్ గుర్తుగా ప్రతి ఏటా ఆమె పేరుతో వరల్డ్‌ రోజ్‌ డే(రోజ్ అనే ఆమె పేరుతో ప్రపంచ గూలాబీ దినోత్సవం) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. క్యాన్సర్‌ రోగుల్లో ఆమె స్ఫూర్తిని నింపేలా ప్రతి ఏడాది ఒక సరికొత్త థీమ్‌తో ఈ ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

గులాబీ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం థీమ్‌ ఏమిటంటే..”జీవించే సమయం తగ్గిపోవచ్చు..కానీ ప్రతి రోజు ఉదయించే సూర్యుడిని చూసినప్పుడల్లా.. మీరు ఈ రోజు గెలిచాను..జీవిస్తున్నాను అనే అనుభూతిని పొందండి. ఈరోజు మృత్యువును గెలిచామని ఆనందించండి.. అలా గెలిచిన ప్రతీరోజుని ఆనందంగా గడపండి..ఆరోజును మనసారా ఆస్వాదించండి.”అనేది థీమ్. బాగుంది కదూ..మృత్యువుని జయించిన రోజు నిజంగానే సుదినం కదూ..