US War Ship USS Gerald R Ford : ఇజ్రాయెల్‌కు వచ్చిన అమెరికా యుద్ధ నౌక వెరీ డేంజర్ గురూ

హమాస్ ఉగ్ర దాడి అనంతరం అమెరికా దేశానికి చెందిన అత్యంత అధునాతన యుద్ధ నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఇజ్రాయెల్ దేశానికి చేరింది. ఇజ్రాయెల్ దేశం పక్షాన అమెరికా యుద్ధ నౌక యుద్ధరంగంలోకి దిగింది.....

US War Ship USS Gerald R Ford : ఇజ్రాయెల్‌కు వచ్చిన అమెరికా యుద్ధ నౌక వెరీ డేంజర్ గురూ

USS Gerald R Ford

US War Ship USS Gerald R Ford : హమాస్ ఉగ్ర దాడి అనంతరం అమెరికా దేశానికి చెందిన అత్యంత అధునాతన యుద్ధ నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఇజ్రాయెల్ దేశానికి చేరింది. ఇజ్రాయెల్ దేశం పక్షాన అమెరికా యుద్ధ నౌక యుద్ధరంగంలోకి దిగింది.

అధునాతన యుద్ధ నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ నౌక శత్రు సేనల పట్ల అత్యంత ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందిన ఈ యుద్ధ నౌకకు యునైటెడ్ స్టేట్స్ యొక్క 38వ అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్ పేరు పెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధంలో నావికా సేవలో పసిఫిక్ థియేటర్‌లోని తేలికపాటి విమాన వాహక నౌక మోంటెరీలో యుద్ధ విధులు నిర్వర్తించింది.

యుద్ధరంగంలోకి దిగిన యూఎస్ యుద్ధనౌక

అట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న ఈ యుద్ధనౌకలో యూఎస్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ భారీ ఆయుధాలున్నాయి. హమాస్ మిలిటెంట్ గ్రూప్ చేసిన క్రూరమైన దాడి తర్వాత యూఎస్ నేవీ ఒక క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను ఇజ్రాయెల్ సమీపంలోని జలాలకు పంపింది. ఈ యుద్ధనౌకలో భారీగా ఆయుధాలు ఉన్నాయి. నౌకా నిరోధక క్షిపణులు ఉన్న ఈ వార్ షిప్ శత్రువులతో పోరాడుతోంది.

US War Ship

US War Ship

Also Read :Israeli woman : ఇజ్రాయెల్ వీర వనిత 25 మంది ఉగ్రవాదులను హతమార్చింది…

ఈ నౌకలో విమాన వాహక నౌకతోపాటు గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్, యూఎస్ఎస్ నార్మాండీ, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు, యూఎస్ఎస్ థామస్ హడ్నర్, యూఎస్ఎస్ రామేజ్, యూఎస్ఎస్యూఎస్ఎస్ కార్నీ, యూఎస్ఎస్ రూజ్‌వెల్ట్ ఉన్నాయని యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు. యూఎస్ సెంట్రల్ కమాండ్, యూఎస్ వైమానిక దళం ఎఫ్-15, ఎఫ్-16, ఎ-10 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ స్క్వాడ్రన్‌లను పెంచడానికి సైన్యం చర్యలు తీసుకుంది’’అని లాయిడ్ ఆస్టిన్ చెప్పారు.

Also Read :Operation Ajay : ఇజ్రాయెల్ యుద్ధ బాధితులను తీసుకువచ్చేందుకు భారత్ ఆపరేషన్ అజయ్ ప్రారంభం

ఈ నౌక భారీ వైమానిక బాంబు దాడులతో ప్రతిస్పందించింది. ఇజ్రాయెల్ పౌరులను రక్షించడానికి, భయంకరమైన తీవ్రవాద దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి యూఎస్ యుద్ధ నౌక ఉపయోగపడనుంది.