US Art Gallery : ఆ ఆర్ట్ గ్యాలరీలో రూ.12.5 కోట్ల విలువైన బుద్ధ విగ్రహం దోచుకెళ్లారు.. ఎక్కడంటే?

US ఆర్ట్ గ్యాలరీ నుంచి రూ.12.5 కోట్ల విలువైన పురాతన బుద్ధుడి విగ్రహం చోరీకి గురైంది. దొంగతనం జరిగిన తీరుని సీసీటీవీలో చూసిన పోలీసులు షాకయ్యారు.

US Art Gallery : ఆ ఆర్ట్ గ్యాలరీలో రూ.12.5 కోట్ల విలువైన బుద్ధ విగ్రహం దోచుకెళ్లారు.. ఎక్కడంటే?

US Art Gallery

US Art Gallery : డేరింగ్ హీస్ట్‌లోని US ఆర్ట్ గ్యాలరీ నుంచి రూ.12.5 కోట్ల విలువైన పురాతన బుద్ధుని విగ్రహాన్ని దొంగ దోచుకెళ్లాడు. 25 నిముషాల పాటు రికార్డైన దొంగతనం వీడియో చూసి లాస్ ఏంజెల్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ అధికారులు షాకయ్యారట.

Buffalo Theft: కర్ణాటకలో వింత కేసు: 20 ఏళ్ల వయసులో గేదె దొంగతనం, 58 ఏళ్ల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

లాంజ్ ఏంజెల్స్‌లోని ఆర్ట్ గ్యాలరీ నుండి 1.5 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.12.5 కోట్లు) విలువైన శతాబ్దాల నాటి జపనీస్ కాంస్య బుద్ధ విగ్రహం దొంగతనం జరిగినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. లాస్ ఏంజెల్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ చెబుతున్న దాని ప్రకారం దాని బరువు 250 పౌండ్లు (114 కిలోలు). సెప్టెంబర్ 18 న బెవర్లీ గ్రోవ్‌లోని బరాకత్ గ్యాలరీ‌లో తెల్లవారు ఝామున 3.45 గంటలకు ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ అరుదైన విగ్రహం జపాన్ ఎడో కాలం (1603-1867) సమయంలో తయారు చేయబడినట్లు తెలుస్తోంది.  4 అడుగుల పొడవుతో బుద్ధుడు కూర్చున్నట్లు తయారు చేసిన ఈ విగ్రహం కాంతులు వెదజల్లుతూ ఉంటుంది.

Money Plant : మనీ ప్లాంట్ దొంగతనం చేసి ఇంట్లో నాటితే నిజంగా అదృష్టం కలిసి వస్తుందా?

ఈ చోరీ మొత్తం ఒక్కడే చేసినట్లు సీసీటీవీలో రికార్డైందట. గ్యాలరీ లోనికి ప్రవేశించిన అనుమానితుడు విగ్రహాన్ని ట్రక్కు మీద తరలించినట్లు తెలుస్తోంది. ఈ దోపిడి మొత్తం 25 నిముషాల పాటు రికార్డైంది. బరువైన విగ్రహాన్ని దొంగ ఒక్కడే మోసుకుని వెళ్లడం చూసిన పోలీసు అధికారులు షాకయ్యారు. కేసుని దర్యాప్తు చేస్తున్నారు. బరాకత్ గ్యాలరీకి, లండన్, సియోల్, హాంకాంగ్‌లలో కూడా బ్రాంచ్‌లు ఉన్నాయి. లాస్ ఏంజెల్స్‌లో గ్యాలరీ 2017 లో ప్రారంభించారు.