చైనా నాటకాలు.. సరిహద్దులో ఉద్రిక్తతలు.. అమరులైన ముగ్గురు భారత సైనికులు 

  • Published By: vamsi ,Published On : June 16, 2020 / 08:41 AM IST
చైనా నాటకాలు.. సరిహద్దులో ఉద్రిక్తతలు.. అమరులైన ముగ్గురు భారత సైనికులు 

Updated On : June 16, 2020 / 8:41 AM IST

చైనా తన వక్ర బుద్ధిని చాటుకుంది లఢక్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఒక బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌తో సహా ముగ్గురు భారతీయ సైనికులను చైనా దళాలు చంపేశాయి. భారతదేశం మరియు చైనా మధ్య మే నెల ప్రారంభం నుంచి, లడఖ్ సరిహద్దు సమీపంలో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. చైనా దళాలు భారతదేశం నిర్దేశించిన ఎల్‌ఐసిని దాటాయి. చైనా సైనికులు గాల్వన్ వ్యాలీలోని పెంగాంగ్ సరస్సు సమీపంలోకి వచ్చారు. సుమారు ఐదు వేల మంది సైనికులు అక్కడకు సైనిక సామగ్రితో వచ్చారు.

దీంతో భారత్, చైనా మధ్య సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్నట్లు కనిపించగా.. గాల్వన్ లోయలో కాస్త పరిస్థితి మెరుగుపడినట్లుగా కనిపించినా.. ఇరు దేశాల సైనికుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఇందులో భారత సైన్యానికి చెందిన ఒక అధికారి, ముగ్గురు సైనికులు అమరవీరులయ్యారు. పరిస్థితిని శాంతింపచేయడానికి సీనియర్ ఆర్మీ అధికారులు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై భారత సైన్యం సమాచారం ఇవ్వగా.. రెండు సైన్యాల మధ్య హింసాత్మక ఘర్షణ చోటుచేసుకుంది.

పరిస్థితిని నియంత్రించడానికి ప్రస్తుతం ఇరువైపుల ఉన్న సీనియర్ సైనిక అధికారులు సమావేశం అవుతున్నారని మిలటరీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇడుప్‌లో చైనా సైనికులు కూడా మరణించారని సైన్యం చెబుతుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ముగ్గురు ఆర్మీ చీఫ్‌లు, విదేశాంగ మంత్రితో తూర్పు లడఖ్‌లో పరిణామాలుపై చర్చిస్తున్నారు. 

అయితే మరోవైపు భారత్ సరిహద్దు దాటిందని చైనా ఆరోపిస్తుంది. భారత్.. సరిహద్దును దాటి తన దళాలపై దాడి చేసిందని చైనా ఆరోపించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఇరు దళాల మధ్య వాగ్వివాదంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖను రాయిటర్స్ ప్రశ్నించినప్పుడు, సమస్య మరింత తీవ్రతరం కాకుండా ఏకపక్ష చర్యలకు దూరంగా ఉండాలని భారతదేశాన్ని కోరింది. 

ప్రశాంతంగా వెనక్కి తగ్గాల్సిన సమయంలో… మీ ఆర్మీ ఎందుకు రెచ్చగొట్టింది అని భారత్… లేదు మా వాళ్లు అలా చెయ్యలేదు అని చైనా ఆర్మీ అధికారులు అంటున్నారు. వాస్తవానికి చైనా నెల నుంచి నాటకాలు ఆడుతూనే ఉంది. లఢక్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి కుట్ర చేస్తుంది. పెద్ద ఎత్తున సరిహద్దుల్లో సైన్యాన్నీ, ఆయుధాల్నీ మోహరించింది. అయితే చైనా ఆటలు సాగలేదు. అమెరికా కూడా భారత్ వైపు నుంచి ఒత్తిడి చెయ్యడంతో… చైనాకి తన ఆటలు సాగవని అర్థమైంది.