United States : యూఎస్ లాస్ వెగాస్‌ యూనివర్శిటీలో కాల్పులు.. ముగ్గురి మృతి

అమెరికా దేశంలో మరోసారి జరిగిన కాల్పులు కలకలం రేపాయి. యునైటెడ్ స్టేట్స్ లాస్ వెగాస్‌లోని నెవాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు....

United States : యూఎస్ లాస్ వెగాస్‌ యూనివర్శిటీలో కాల్పులు.. ముగ్గురి మృతి

United States

United States : అమెరికా దేశంలో మరోసారి జరిగిన కాల్పులు కలకలం రేపాయి. యునైటెడ్ స్టేట్స్ లాస్ వెగాస్‌లోని నెవాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ కాల్పుల్లో నిందితుడు కూడా మరణించాడని యూఎస్ పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని యూఎస్ అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించామని లాస్ వెగాస్ పోలీసులు చెప్పారు.

ALSO READ : తెలంగాణలో కీలక అధికారుల మార్పునకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు

కాల్పులు జరిపిన నిందితుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడా లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడా అనే విషయంపై స్పష్టత రాలేదు. కాల్పుల ఘటన అనంతరం యూనివర్శిటీని పోలీసులు ఖాళీ చేయించారు. బ్యాక్‌ప్యాక్‌లతో ఉన్న పలువురు విద్యార్థులను పోలీసులు క్యాంపస్ వెలుపలికి తీసుకెళ్లడం కనిపించింది. నెవాడా యూనివర్శిటీ క్యాంపస్ లో తుపాకీ కాల్పుల శబ్ధం వినిపించిందని ప్రొఫెసర్ విన్సెంట్ పెరెజ్ చెప్పారు.

ALSO READ : బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

కాల్పుల శబ్దాన్ని విని తాము లోపలకు పరుగెత్తామని ప్రొఫెసర్ చెప్పారు. కాల్పుల ఘటనతో దక్షిణ నెవాడా యూనివర్శిటీని మూసివేశారు. యూనివర్శిటీ సమీపంలోని రోడ్లను సైతం పోలీసులు మూసివేశారు. లాస్ వెగాస్ క్యాంపసులో 25వేలమంది అండర్ గ్రాడ్యుయేట్లు, 8వేల మంది పోస్టుగ్రాడ్యుయేట్లు చదువుతున్నారు. 2017వ సంవత్సరంలో లాస్ వెగాస్ లో ఓ సాయుధుడు హోటల్ నుంచి జరిపిన కాల్పుల్లో 60 మంది మరణించారు.