150 కోట్ల మార్క్ దాటిన టిక్ టాక్

చైనా తయారు చేసిన సోషల్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ సంచలనాలు నమోదు చేస్తోంది . 150 కోట్ల డౌన్ లోడ్ల మైలురాయిని దాటి రికార్డు సృష్టించింది. 2017 లో అందుబాటు లోకి వచ్చిన ఈయాప్ 100 కోట్ల మైలురాయిన 2019 ఫిబ్రవరిలో దాటింది. అప్పటి నుంచి గత9నెలల కాలంలో మరో 50 కోట్లు డౌన్ లోడ్ లు అయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1.5 బిలియన్ల మంది యాప్ స్టోర్ నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారని మొబైల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘సెన్సార్ టవర్’ వివరించింది. 466.8 మిలియన్ (31 శాతం) డౌన్‌లోడ్స్‌తో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 614 మిలియన్ల మంది టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది ఆరు శాతం అధికమని తెలిపింది.
చైనా తయారు చేసిన ఈయాప్ మనదేశంలోనే అత్యధిక ప్రజాదరణ పొందింది. మొత్తం 150 కోట్ల డౌన్ లోడ్స్ లో 46.68 కోట్ల డౌన్ లోడ్స్(31 శాతం) మనదేశంలోనే అయ్యాయి. మొబైల్ ఇంటిలి జెన్స్ నివేదిక ప్రకారం ఒక్క 2019 లో టిక్ టాక్ ను 61.4 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది అత్యధికంగా డౌన్లోడ్ అయిన యాప్స్ లో టిక్ టాక్ కన్నా ముందు వాట్సప్ 70.7 కోట్లు, ఫేస్ బుక్ మెసెంజర్ 63.62 కోట్లు ఉన్నాయి. టిక్ టాక్ తర్వాత నాలుగు, ఐదు స్ధానాల్లో ఫేస్ బుక్ ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి.