హాలీవుడ్ హీరో రక్తంతో కరోనా వ్యాక్సిన్
కరోనా వైరస్ నుంచి కోలుకున్న టామ్ హాంక్స్, రీటా విల్సన్ వారి రక్తాన్ని డొనేట్ చేసేందుకు సిద్ధమయ్యారు. మహమ్మారికి మందు తయారీలో వారి బ్లడ్ శాంపుల్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపార

కరోనా వైరస్ నుంచి కోలుకున్న టామ్ హాంక్స్, రీటా విల్సన్ వారి రక్తాన్ని డొనేట్ చేసేందుకు సిద్ధమయ్యారు. మహమ్మారికి మందు తయారీలో వారి బ్లడ్ శాంపుల్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపారు. మార్చి నెలారంభంలో వీరిద్దరికీ COVID-19పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఆస్ట్రేలియాలో బాజ్ ల్యూరమన్స్ ఎల్విస్ ప్రెస్లీ బయోపిక్ తీస్తుండగా రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలింది.
దాంతో వారిద్దరూ లాస్ ఏంజిల్స్ లోని తమ ఇంటికి వచ్చేసి క్వారంటైన్ లో ఉండిపోయారు. మాతో పాటు గత వారం విల్సన్ కూడా బ్లడ్ డొనేట్ చేసేందుకు ముందుకొచ్చాడు. కరోనా వైరస్ పై రీసెర్చ్ లో ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఇంతకంటే మేమేం చేయగలం. మా శరీరంలో యాంటీబాడీలను మాత్రమే ఇవ్వగలమని టామ్ హాంక్స్ అంటున్నారు.
మమ్మల్ని అడిగితే ఒప్పుకోలేదు. మేమే స్వచ్ఛందంగా రెడీగా ఉన్నామని చెప్తున్నాం’ అని అంటూనే ఒకవేళ తన బ్లడ్ శాంపుల్స్ తో వ్యాక్సిన్ రెడీ అయితే దానికి హాంక్ క్సిన్ అని పేరు పెట్టాలని కూడా సూచిస్తున్నాడు. ప్రస్తుతం వారిద్దరూ కోలుకున్నారు. తన భార్య ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడుతూ.. రీటా చాలా కష్టం ఎదుర్కొంది. ఎక్కువగా ఫీవర్ వచ్చింది తనకి. ఆమెకు వాసన, రుచి కూడా తెలియలేదు. ఈ మూడు వారాలు ఆహారాన్ని ఆస్వాదించకుండానే తీసుకుందని చెప్పుకొచ్చాడు.