Gun Fire : కొత్త ఏడాది వేడుకల్లో విషాదం.. దుండగుల కాల్పుల్లో ముగ్గురు మృతి

అమెరికాలో మరోసారి గన్ ఫైర్ జరిగింది. న్యూఇయర్ వేడుకలను టార్గెట్‌గా చేసుకున్న కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

Gun Fire : కొత్త ఏడాది వేడుకల్లో విషాదం.. దుండగుల కాల్పుల్లో ముగ్గురు మృతి

Gun Fire (2)

Updated On : January 2, 2022 / 8:06 AM IST

Gun Fire : అమెరికాలో మరోసారి గన్ ఫైర్ జరిగింది. న్యూఇయర్ వేడుకలను టార్గెట్‌గా చేసుకున్న కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. మిసిసిపీ గల్ఫ్‌పోర్ట్‌లో నిర్వహించిన నూతన సంవత్సరం వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుల కాల్పుల్లో ముగ్గురు అక్కడిక్కకడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కాల్పుల్లో మరణించిన వారిలో 11 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. కాల్పుల విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కాల్పుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

చదవండి : Arjuna Phalguna: ఈ ఏడాది మూడవ సినిమాతో గ్రాండ్ సెండాఫ్ చెప్పిన శ్రీవిష్ణు!

పోలీసులు వచ్చే సరికే దుండగులు పారిపోయారు. వారికోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దుండగులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు పోలీస్ అధికారులు తెలిపారు. ఇక అమెరికాలో కాల్పుల ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. గతేడాది దుండగుల కాల్పుల్లో 200 మంది వరకు సాధారణ పౌరులు మృతిచెందినట్లుగా అమెరిక సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఇక 2022 వేడుకల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో మొత్తం 11 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు అధికారులు

చదవండి : Gun Fire : అనుమానంతో కూతురిపై కాల్పులు