ISIS చీఫ్ బాగ్దాదీ చావుకి కారణమైన కుక్కకి ట్రంప్ సన్మానం

నరమేధంతో ప్రపంచాన్ని గడగడలాడించిన ఐసిస్ చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూబకర్ అల్ బాగ్దాదీ చావుకి కారణమైన కుక్క కోనన్. ఈ కుక్క కారణంగానే బాగ్దాదీ కుక్క చావు

  • Published By: veegamteam ,Published On : November 26, 2019 / 03:52 AM IST
ISIS చీఫ్ బాగ్దాదీ చావుకి కారణమైన కుక్కకి ట్రంప్ సన్మానం

Updated On : November 26, 2019 / 3:52 AM IST

నరమేధంతో ప్రపంచాన్ని గడగడలాడించిన ఐసిస్ చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూబకర్ అల్ బాగ్దాదీ చావుకి కారణమైన కుక్క కోనన్. ఈ కుక్క కారణంగానే బాగ్దాదీ కుక్క చావు

నరమేధంతో ప్రపంచాన్ని గడగడలాడించిన ఐసిస్ చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూబకర్ అల్ బాగ్దాదీ చావుకి కారణమైన కుక్క కోనన్. ఈ కుక్క కారణంగానే బాగ్దాదీ కుక్క చావు చచ్చాడు. తనను తాను పేల్చుకున్నాడు. పారిపోతున్న ఉగ్రవాదులను వెంటాడిన కోనన్.. బాగ్దాదీ మరణానికి కారణమైంది. దీంతో కోనన్ ఇప్పుడు హీరో అయ్యింది. ప్రపంచ దేశాలను గడగడలాడించిన బాగ్దాదీని అంతం చేసిన నువ్వు కుక్క కాదు హీరో అని అంతా ప్రశంసించారు.

తాజాగా కోనన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్మానించారు. వైట్ హౌస్ లో ఈ కార్యక్రమం జరిగింది. బాగ్దాదీ చావుకి కారణమైన జాగిలాన్ని హీరోతో పోల్చారు డొనాల్డ్ ట్రంప్. వైట్ హౌస్ లో స్పెషల్ ఫోర్సెస్ తో ట్రంప్ సమావేశం అయ్యారు. ఆ తర్వాత రోజ్ గార్డెన్ వేడుకలో పాల్గొన్నారు. కోనన్ పై ప్రశంసల వర్షం కురిపించారు ట్రంప్.

”ఇది మెరుపు దాడి. అల్-బాగ్దాదీ చచ్చాడు. కోనన్ ను సన్మానించాము. పతకం ఇచ్చాము. కోనన్ చాలా ప్రత్యేకమైన కుక్క. సో బ్రిలియంట్, సో స్మార్ట్” అని ట్రంప్ ప్రశంసించారు. కోనన్ నమ్మశక్యం కాని జాగిలం అని, జాగిలాన్ని సన్మానించడం గర్వంగా ఉందని చెప్పారు. ఉగ్రవాదులను వేటాడే సమయంలో గాయపడిన కోనన్… గాయాల నుంచి త్వరగా కోలుకుందని వెల్లడించారు.

సిరియాలో బాగ్దాదీ కోసం అమెరికా దళాలు చేపట్టిన ఆపరేషన్ లో కోనన్ కీ రోల్ ప్లే చేసింది. బాగ్దాదీ చావుకి కారణమైంది. సొరంగంలో దాక్కున్న బాగ్దాదీ చివరికి తప్పించుకోలేనని నిర్ధారించుకున్నాక ఆత్మాహుతి చేసుకున్నాడు. రహస్య సొరంగంలో బాగ్దాదీ తనను తాను పేల్చేసుకోవడంతో కోనన్ గాయపడింది. కోనన్ బెల్జియన్‌ మలినోయిస్‌ జాతికి చెందిన కుక్క.