ఆయన అసలే ట్రంప్ : టర్కీని ఆర్థికంగా నాశనం చేస్తా

  • Published By: veegamteam ,Published On : January 14, 2019 / 07:32 AM IST
ఆయన అసలే ట్రంప్ : టర్కీని ఆర్థికంగా నాశనం చేస్తా

Updated On : January 14, 2019 / 7:32 AM IST

టర్కీని ఆర్థికంగా నాశనం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిరియాలో అమెరికా మద్దతు ఉన్న కుర్దు దళాలపై టర్కీ దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ట్రంప్ టర్కీని హెచ్చరించారు. కుర్దులను టర్కీ తీవ్రవాదులుగా పరిగణిస్తోంది. సిరియా నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని ఇటీవల ట్రంప్ నిర్ణయం తీసుకొన్నారు. శుక్రవారం(జనవరి 11,2019) నుంచి అమెరికా దళాలు సిరియా నుంచి వైదొలగడం ప్రారంభించాయి. 2వేల మంది సైనికులు మినహా మిగిలినవారు తిరుగుపయనమయ్యారు. దీంతో సిరియాలోని కుర్దు దళాలపై టర్కీ దాడులు చేసే అవకాశం ఉంది. కుర్దుల కారణంగా దేశంలోకి చొరబాట్లు పెరుగుతున్నాయని టర్కీ భావిస్తోంది.ఈ సమయంలో ఆదివారం కుర్దులను ఉద్దేశించి ట్రంప్  ట్వీట్ చేశారు. టర్కీని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని కుర్దులకు హితవు పలికారు.
ప్పటి నుంచో  అనుకుంటున్న సిరియా నుంచి బలగాలను ఉపసంహరణ మొదలైంది.  ఐసిస్ అక్కడ నామమాత్రంగానే మిగిలిపోయింది. ఒకవేళ ఐసిస్ మళ్లీ పడగవిప్పితే సమీప స్థావరాల నుంచి వాటిపై మళ్ల దాడులు చేస్తాం. కుర్దులపై దాడులు చేస్తే టర్కీని ఆర్థికంగా నాశనం చేస్తాం. అదేవిధంగా కుర్దులూ టర్కీని రెచ్చగొట్టకూడదు. సిరియాలో ఐసిస్ ను అంతమొందిచాలన్న అమెరికా దీర్ఘకాలిక విధానం ద్వారా రష్యా, ఇరాన్ , సిరియాలు లబ్దిపొందాయి. మేము కూడా లబ్ది పొందాము కానీ అంతలేని యుద్ధానికి ఫుల్ స్టాఫ్ పెట్టేందుకు సిరియా నుంచి మా బలగాలను ఉపసంహరించుకొనే సమయం ది అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.