Pakistan Army: ఇద్దరు హిందూ ఆఫీసర్లకు లెఫ్టినెంట్ కల్నల్‌గా ప్రమోషన్
ఇద్దరు పాకిస్తాన్ ఆఫీసర్లను లెఫ్టినెంట్ కల్నల్స్ గా ప్రమోట్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ అఫీషియల్ మీడియా ప్రకటించిన ఈ నిర్ణయాన్ని ముస్లిం మెజారిటీ దేశంలో సోషల్ మీడియా..

Pakistan Army
Pakistan Army: ఇద్దరు పాకిస్తాన్ ఆఫీసర్లను లెఫ్టినెంట్ కల్నల్స్ గా ప్రమోట్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ అఫీషియల్ మీడియా ప్రకటించిన ఈ నిర్ణయాన్ని ముస్లిం మెజారిటీ దేశంలో సోషల్ మీడియా అప్రిషియేట్ చేస్తుంది. మేజర్ డా.కెలాశ్ కుమార్, మేజర్ డా. అనీల్ కుమార్ లను లెఫ్టినెంట్ కల్నల్స్ గా పాకిస్తాన్ బోర్డ్ వారి ప్రమోషన్లను అప్రూవ్ చేసింది.
తర్పార్కర్ జిల్లాలోని సింధు ప్రాంతానికి చెందిన కెలాశ్ కుమార్ హిందూ కమ్యూనిటీ నుంచి మేజర్ అయిన తొలి అధికారి. 1981లో పుట్టి.. పాకిస్తాన్ ఆర్మీలో 2008లో జాయిన్ అయ్యారు. లియాఖత్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ హెల్త్ అండ్ సైన్సెస్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసి కెప్టెన్ గా జాయిన్ అయ్యారు.
అనీల్ కుమార్ వయస్సు రీత్యా కెలాశ్ కంటే చిన్నవాడు. సింధూ ప్రాంతంలోని బదీన్.. 2007లోనే పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. పాకిస్తాన్ టెలివిజన్ లో ఇలా ట్వీట్ చేసింది.
Read Also: పాకిస్తాన్ రక్తసిక్తం..భారీ సంఖ్యలో సైనికులు మృతి
‘లెఫ్టినెంట్ కల్నల్‌గా తొలి హిందూ ఆఫీసర్‌గా ప్రమోట్’ అయ్యాడు. పాకిస్తాన్ లోని హిందూ కమ్యూనిటీ హక్కుల ప్రచారకర్త అయిన కపిల్ దేవ్ సైతం దీనిని పర్సనల్ గా ట్వీట్ చేశారు.
‘కంగ్రాచ్యులేషన్స్ కెలాశ్.. లెఫ్టినెంట్ కల్నల్ గా కెలాశ్ కుమార్ ప్రమోట్ అయ్యాడు’ అని దేవ్ ట్వీట్ చేశారు.