గ్రేట్ ఎస్కేప్ : రన్ వే టచ్ చేస్తూ.. సెకన్లలో గాల్లోకి విమానం

అది లండన్ ఎయిర్ పోర్ట్. భీకర గాలులు.. వాటి వేగం 100కిలోమీటర్ల వరకు ఉంది. లండన్ సిటీ అంతా బీభత్సంగా ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఎయిర్ పోర్ట్ లో బ్రిటీష్ ఎయిర్ వేర్ విమానం ల్యాండ్ కావాల్సి ఉంది.

  • Published By: sreehari ,Published On : February 9, 2019 / 10:11 AM IST
గ్రేట్ ఎస్కేప్ : రన్ వే టచ్ చేస్తూ.. సెకన్లలో గాల్లోకి విమానం

Updated On : February 9, 2019 / 10:11 AM IST

అది లండన్ ఎయిర్ పోర్ట్. భీకర గాలులు.. వాటి వేగం 100కిలోమీటర్ల వరకు ఉంది. లండన్ సిటీ అంతా బీభత్సంగా ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఎయిర్ పోర్ట్ లో బ్రిటీష్ ఎయిర్ వేర్ విమానం ల్యాండ్ కావాల్సి ఉంది.

అది లండన్ ఎయిర్ పోర్ట్. భీకర గాలులు.. వాటి వేగం 100కిలోమీటర్ల వరకు ఉంది. చెట్లు కూలుతున్నాయి.. ఇంటి కప్పులు ఎగిరిపోతున్నాయి.. లండన్ సిటీ అంతా బీభత్సంగా ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఎయిర్ పోర్ట్ లో బ్రిటీష్ ఎయిర్ వేర్ విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. ఆ విమానంలో 100 మందిపైనే ప్రయాణికులు. వాతావరణం అనుకూలించక అప్పటికే రెండు సార్లు ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదు ఎయిర్ పోర్ట్ అథారిటీ.

మూడోసారి గ్రీన్ సిగ్నల్. అయినా ఎందుకో టెన్షన్. భీకర గాలులకు ఏమైనా అవుతుందా అనే ఆందోళన అందరిలో నెలకొంది. మరోవైపు వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఐర్లాండ్ మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. 120 కిలోమీటర్ల వేగంతో వీదురు గాలులు వీస్తున్నాయి. డోనెగల్, గాల్వే, మాయో వంటి దేశాల్లో ఆరెంజ్ వెదర్ వార్నింగ్ ప్రకటించింది. 

ఈ టెన్షన్స్ మధ్యే విమానం ల్యాండింగ్ కు వస్తోంది.. గాలలకు షేక్ అవుతుంది.. అయినా సరే సేఫ్ గా ల్యాండ్ అవ్వొచ్చని భావించిన పైలెట్.. రన్ వే పైకి వచ్చేస్తున్నాడు. జస్ట్ విమానం చక్రాలు రన్ వేను టచ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ కుదుపునకు గురైంది విమానం. అంతే ఏ మాత్రం ఆలస్యం చేయలేదు.. మరో ఆలోచన చేయలేదు.. మళ్లీ విమానాన్ని గాల్లోకి అత్యంత వేగంగా లేపాడు.. ఓ మై గాడ్ అంటూ అందరూ నివ్వెరపోయారు.

కొద్దిసేపు షాక్ లో అలానే చూస్తూ ఉండిపోయారు. పైలెట్ సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు. ఆ తర్వాత కొద్ది సమయానికి సేఫ్ ల్యాండింగ్ చేశాడు పైలెట్. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.